MAA Elections 2021 : విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు : నరేష్

'మా' ఎలక్షన్స్ ఎంత గందరగోళం సృష్టించాయో చూశాం. ఎలక్షన్స్ అయి రిజల్స్ వచ్చిన తర్వాత కూడా 'మా' వివాదాలు ఆగట్లేదు. ఎలక్షన్ రోజున రౌడీయిజం చేసారని, ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదని, మమ్మల్ని

MAA Elections 2021 :  ‘మా’ ఎలక్షన్స్ ఎంత గందరగోళం సృష్టించాయో చూశాం. ఎలక్షన్స్ అయి రిజల్స్ వచ్చిన తర్వాత కూడా ‘మా’ వివాదాలు ఆగట్లేదు. ఎలక్షన్ రోజున రౌడీయిజం చేసారని, ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదని, మమ్మల్ని తిట్టారని, వాళ్ళతో కలిసి పనిచేయలేమని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచినా వాళ్లంతా నిన్న మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అంతకుముందే ప్రకాష్ రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుంది అనుకునేలోపు ఇవాళ నరేష్ మళ్ళీప్రకాష్ రాజ్ ప్యానల్ పై ఫైర్ అయ్యారు.

ఇవాళ మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేష్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలిసి పని చేస్తాం అన్నవాళ్లు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ఓడినా,గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి అని అన్నారు. మోడీ గెలిచాడు అంటే కాంగ్రెస్‌ వాళ్లు దేశం వదిలి వెళ్లలేదు కదా మీరెందుకు ‘మా’ వదిలేస్తున్నారు?. ‘మా’ అనేది కుటుంబం. గెస్ట్‌గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారు అని వ్యాఖ్యానించారు.

BiggBoss Lahari : ఫోక్ సాంగ్ తో అదరగొడుతున్న బిగ్ బాస్ లహరి

ఫ్యాక్షనిజం మానేద్దాం. కలసి పనిచేద్దాం. రిజైన్‌ చేసిన ఈసీ మెంబర్స్‌ గురించి కొత్త ప్యానల్‌ చూసుకుంటుంది. విష్ణుని ఎవరైనా డిస్ర్టర్భ్‌ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్‌, ప్రస్టేషన్‌ వద్దు. ఎవరెవరు అని నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి అంటూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ పై నరేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు