×
Ad

Malli Pelli : మళ్లీ పెళ్లి సినిమాపై వివాదం.. సినిమా రిలీజ్ ఆపాలంటూ కోర్టుకెళ్లిన నరేష్ మూడో భార్య..

మళ్లీ పెళ్లి సినిమాకు రిలీజ్ కి ముందు అడ్డంకి ఎదురైంది. గతంలో నరేష్ - పవిత్ర విషయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకొచ్చి రచ్చ చేసింది. నరేష్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళ పెళ్లి జరగనివ్వనని కామెంట్స్ చేసింది. తాజాగా రమ్య మళ్లీ పెళ్లి సినిమాను ఆపాలంటూ కోర్టుకి వెళ్ళింది.

  • Published On : May 25, 2023 / 02:15 PM IST

Naresh's third wife Ramya filed a petition in the court on Malli Pelli Movie

Malli Pelli Movie :  MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర(Pavithra) జంటగా తెరకెక్కిన సినిమా మళ్ళీ పెళ్లి(Malli Pelli). ఇటీవల సీనియర్ నటుడు నరేశ్(Naresh) జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) చివరి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమాకు రిలీజ్ కి ముందు అడ్డంకి ఎదురైంది. గతంలో నరేష్ – పవిత్ర విషయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకొచ్చి రచ్చ చేసింది. నరేష్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళ పెళ్లి జరగనివ్వనని కామెంట్స్ చేసింది. తాజాగా రమ్య మళ్లీ పెళ్లి సినిమాను ఆపాలంటూ కోర్టుకి వెళ్ళింది.

Naresh : నేను రివెంజ్ తీర్చుకోడానికి ఈ సినిమా చెయ్యట్లేదు.. మళ్ళీ పెళ్లికి సీక్వెల్ కూడా ఉంటుంది..

నేడు నరేష్ మూడో భార్య రమ్య కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో మళ్లీ పెళ్లి సినిమాను ఆపాలంటూ పిటిషన్ వేసింది. ఈ సినిమా రిలీజ్ ఆపాలని, సినిమాలో తనని కించపరిచేవిధంగా సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొంది. నేడు కోర్టు దీనిపై విచారించే అవకాశం ఉంది. మరి మళ్లీ పెళ్లి సినిమా విడుదలవుతుందా? చివరి నిమిషంలో నరేష్ కి కోర్టు షాక్ ఇస్తుందా చూడాలి. రేపే నరేష్, పవిత్ర జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.