RRR – Pushpa : ఆర్ఆర్ఆర్, పుష్ప చూడలేదు.. అలాంటి సినిమాలు చూసి.. బాలీవుడ్ నటుడు వైరల్ కామెంట్స్..
RRR, పుష్ప సినిమాలోని ఒక్క సీన్ కూడా చూడలేదు. అలాంటి సినిమాలు చూసి ఆడియన్స్ ఎలా థ్రిల్ ఫీల్ అవుతారో నాకు అర్ధం కాదు. బాలీవుడ్ నటుడు వైరల్ కామెంట్స్.
- gum 95921
- Published on- September 27, 2023 / 08:54 PM IST
Naseeruddin Shah viral comments on RRR Pushpa movies
RRR – Pushpa : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయి అందరికి తెలిసిందే. ఈ రెండు మూవీలను దేశంలో దాదాపు అందరూ చూసిన వారే. అయితే తాజాగా ఒక బాలీవుడ్ నటుడు ఈ రెండు సినిమాలను అసలు చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు..?
Pawan Kalyan : ఉస్తాద్ షూటింగ్లో పవన్ కళ్యాణ్.. ఫుల్ స్వింగ్లో..!
క్రిష్, డర్టీ పిక్చర్స్ సినిమాల్లో నటించిన నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) ఈ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ లోని పలు సూపర్ హిట్ సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి మంచి పేరుని సంపాదించుకున్న నసీరుద్దీన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నేను ఇప్పటివరకు RRR, పుష్ప సినిమాలోని ఒక్క సీన్ కూడా చూడలేదు. అలాంటి సినిమాలు చూసి ఆడియన్స్ ఎలా థ్రిల్ ఫీల్ అవుతారో నాకు తెలియదు” అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు.
Sunny Leone : తెలుగు మీడియం ఐ స్కూల్ స్టార్ట్ చేస్తున్న సన్నీ లియోన్..
“ప్రస్తుతం సినిమాల్లో హీరోయిజం ఎక్కువ కనిపిస్తుంది. తమని తాము తక్కువ చేసుకునే భావం పురుషుల్లో కలగడం వలనే ప్రెజెంట్ ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లోని మార్వెల్స్ సిరీస్ లో ఇది ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం అది భారత చిత్రాల్లో కూడా కనిపిస్తుంది. ఆ కారణం వలనే ఆర్ఆర్ఆర్, పుష్ప నేను చూడలేదు. వాటిని చూసి ఎలా థ్రిల్ ఫీల్ అవుతారో నాకు అర్ధంకాదు. అయితే మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చూశాను. సినిమా తెరకెక్కించడంలో ఆయనకి ఎటువంటి అజెండాలు ఉండవు. ఆయన గొప్ప దర్శకుడు” అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు పై టాలీవుడ్ ఆడియన్స్ స్పందిస్తూ.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
