Sunny Leone : తెలుగు మీడియం ఐ స్కూల్ స్టార్ట్ చేస్తున్న సన్నీ లియోన్..

తెలుగు టెలివిజన్ రంగంలోకి సన్నీ లియోన్ ఎంట్రీ. తెలుగు మీడియం ఐ స్కూల్ స్టార్ట్ చేస్తూ..

Sunny Leone : తెలుగు మీడియం ఐ స్కూల్ స్టార్ట్ చేస్తున్న సన్నీ లియోన్..

Sunny Leone new telugu telivision show Telugu Medium ischool

Updated On : September 27, 2023 / 7:16 PM IST

Sunny Leone : అడల్ట్ సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన సన్నీ లియోన్.. నార్త్ టు సౌత్ పలు భాషల్లో నటిస్తూ వచ్చింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోలు, టీవీ షోల్లో కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఈ భామ తెలుగులో మంచు మనోజ్ ‘కరెంటు తీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఒక స్పెషల్ సాంగ్, రీసెంట్ గా మంచు విష్ణు ‘జిన్నా’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది.

Parineeti Chopra : రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా వివాహ వీడియో.. కొత్తజంట డ్యాన్స్ వైరల్..!

ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో ఒక షోకి సన్నీ లియోన్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుంది. తాజాగా ఆ షోకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో సన్నీ లియోన్.. ‘తెలుగు నాకు జీవితాన్ని ఇచ్చింది’ అంటూ తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంటుంది. ఈ ప్రోగ్రాంకి ‘తెలుగు మీడియం ఐ స్కూల్’ అని పేరుని పెట్టారు. ఇక ఈ షోలో సన్నీ లియోన్ తో పాటు యాంకర్ రవి స్టేజి పై కనిపించబోతున్నాడు. ఈ ప్రోమోతో ఈ ప్రోగ్రాం పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి సన్నీ లియోన్ ఈ షోతో తెలుగు ఆడియన్స్ ని ఎలా అలరిస్తుందో చూడాలి. ఒకసారి మీరుకూడా ఆ ప్రోమోని చూసేయండి.

కాగా సన్నీ లియోన్ ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు, మలయాళ, కన్నడలో ఒక్కో సినిమా చేస్తుంది. ఉపేంద్ర UI లో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.