Parineeti Chopra : రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా వివాహ వీడియో.. కొత్తజంట డ్యాన్స్ వైరల్..!

పెళ్లి వేడుకలో సంతోషంతో డ్యాన్స్ వేసిన పరిణీతి చోప్రా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Parineeti Chopra : రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా వివాహ వీడియో.. కొత్తజంట డ్యాన్స్ వైరల్..!

Parineeti Chopra Raghav Chaddha dance video at their wedding event

Updated On : September 27, 2023 / 5:34 PM IST

Parineeti Chopra : బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chaddha) గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికి తెలిసిందే. మొన్నటివరకు ఈ ఇద్దరు చెట్టపట్టాలు వేసుకొని ముంబై విధుల్లో, రెస్టారెంట్స్ లో డిన్నర్ పార్టీలు, సరదాగా క్రికెట్ మ్యాచ్ షోలు చూస్తూ పబ్లిక్ లో తెగ సందడి చేశారు. ఇక ఈ ఏడాది మే నెలలో నిశ్చతార్థం చేసుకొని పెళ్లికి సిద్దమైన ఈ జంట.. రీసెంట్ గా ఏడడుగులు వేసి పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టారు. 2023 సెప్టెంబర్ 24న వీరి వివాహం ఘనంగా జరిగింది.

Jailer 2: ‘జైలర్‌-2’ కోసం అడ్వాన్స్ అందుకున్న ద‌ర్శ‌కుడు నెల్సన్‌ దిలీప్ కుమార్..! ఎంతో తెలుసా..?

రాజస్ధాన్‌ ఉదయ్‌పూర్ (Udaipur) లోని లీలా ప్యాలెస్ లో సెప్టెంబర్ 22న మొదలైన వివాహ వేడుక మూడు రోజులు పాటు ఘనంగా జరిగింది. మెహందీ, హల్దీ, సంగీత్ అంటూ రాఘవ్ అండ్ పరిణీతి తమ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇక పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కోటిగా బయటకి వస్తున్నాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో పరిణీతి, రాఘవ్ కలిసి పెళ్లి మండపం దగ్గరకి వస్తున్నారు. ఈ సమయంలో పరిణీతి సంతోషంతో డ్యాన్స్ వేసి అందర్నీ ఆకట్టుకుంది. మరి పరిణీతి సంతోషాన్ని మీరు కూడా ఒకసారి చూసేయండి.

Ram Gopal Varma : ఓ అమ్మాయి కోసం వ‌ర్మ ఆరాటం.. పేరు చెప్పాలంటూ ట్వీట్‌.. వైర‌ల్‌

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యి కొత్త జంటకి తమ అశీసులు అందజేశారు. ఇక ఈ వివాహంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ హాజరయ్యి రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాని ఆశీర్వదించారు. కాగా రాఘవ్ అండ్ పరిణీతి ఒకే స్కూల్ లో చదువుకున్నారట. ఒక ఫ్యామిలీ బ్రేక్ ఫాస్ట్ ఈవెంట్ లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం నేడు పెళ్లితో కొత్త ప్రయానికి మొదలయింది.