Ashish Gandhi : ‘నాటకం’ హీరో ఆశిష్ గాంధీ.. ఇప్పుడు ‘రుద్రంగి’తో.. వైవిధ్యభరితమైన కథలతో, వరుస ఆఫర్స్‌తో..

తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ సినిమాగా రాబోతున్న ఈ రుద్రంగి చిత్రంలో మల్లేష్ అనే ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు ఆశిష్ గాంధీ. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుంది.

Natakam Movie Hero Ashish Gandhi busy with movie offers now coming with Jagapathi Babu Rudrangi

Ashish Gandhi :  కెరీర్ ఆరంభం నుంచే ఓ బలమైన గోల్‌తో ముందుకు వెళుతున్నారు యువ హీరో ఆశిష్ గాంధీ. ఎలాగైనా స్టార్ స్టేటస్ పొందాలనే కసితో వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ తో అందరి దృష్టిలో పడుతున్నారు. సినీ జర్నీలో ఆయన వేస్తున్న ప్రతి అడుగు విజయానికి సోపానంగా మారుతోంది. కంటెంట్ పరంగా రిచ్ గా ఉండే సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు ఆశిష్ గాంధీ.

తొలి చిత్రం ‘నాటకం’తో ప్రేక్షకుల మనసు దోచేసిన ఆశిష్ గాంధీ.. అప్పటి నుంచి విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుంటూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాటకంతో తన నటనా ప్రతిభను బయటపెట్టిన ఆయన.. ఆ తర్వాత దర్శకుడు, ఉనికి వంటి డిఫరెంట్ సబ్జెక్ట్ సినిమాల్లో నటించారు. మరికొద్ది రోజుల్లో ఆశిష్ గాంధీ నటించిన రుద్రంగి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ సినిమాగా రాబోతున్న ఈ రుద్రంగి చిత్రంలో మల్లేష్ అనే ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు ఆశిష్ గాంధీ. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆశిష్ గాంధీ రోల్‌పై క్యూరియాసిటీ పెంచాయి. జులై 7న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

అటు మలయాళ ప్రేక్షకులను కూడా తన నటనతో అలరించేందుకు రెడీ అవుతున్నారు హీరో ఆశిష్ గాంధీ. పికాసో (Picaso) అనే వైవిధ్యభరితమైన చిత్రంతో కేరళ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టేసి సెట్స్‌పై బిజీ బిజీగా ఉంటున్నారు. ఆశిష్ గాంధీ చేస్తున్న తదుపరి సినిమా హద్దు లేదు రా. స్వర్ణ పిక్చర్స్, టైగర్ హిల్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

Anushka Shetty : అనుష్క గ్రాండ్ కంబ్యాక్ ఆ రోజే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్..

అదేవిధంగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లో మరో మూవీ చేస్తున్నారు ఆశిష్ గాంధీ. పవర్‌ఫుల్ కథతో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ నెలలో సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రాన్ని SBS బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఎలాంటి రోల్ అయినా చేయగలను అనే సత్తా ఉన్న ఆశిష్ గాంధీకి ఆయన సన్నిహితులతో పాటు ప్రేక్షకులు బెస్ట్ విషెస్ చెబుతూ ప్రోత్సహిస్తున్నారు.