Navadeep: రామచంద్ అనే వ్యక్తితో నాకు పరిచయం ఉన్నమాట వాస్తవమే: డ్రగ్స్ కేసుపై హీరో నవదీప్

నవదీప్ ఫోన్ ను అధికారులు సీజ్‌ చేసినట్లు తెలిసింది. అలాగే, అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Navadeep – Madhapur Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసు విషయంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు టాలీవుడ్ హీరో నవదీప్ సమాధానాలు ఇచ్చాడు. ఇవాళ నవదీప్ ను పోలీసులు దాదాపు ఆరు గంటల పాటు డ్రగ్స్ కేసులో విచారించారు. అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడాడు. రామచంద్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉన్నమాట వాస్తవమేనని తెలిపాడు.

అయితే, తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. గతంలో ఒక పబ్ ను నిర్వహించినందుకు పోలీసులు తనను పిలిచి విచారించారని అన్నాడు. గతంలో సిట్, ఈడీ విచారించిందని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో విచారిస్తోందని తెలిపాడు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నాడు.

డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చాయని, అందుకే హాజరయ్యానని చెప్పాడు. అవసరం ఉంటే తనను మళ్లీ పిలుస్తామని చెప్పారని అన్నాడు. ఈ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పనిచేస్తోందంటూ ప్రశంసలు కురిపించే ప్రయత్నం చేశాడు. కాగా, నవదీప్ ఫోన్ ను అధికారులు సీజ్‌ చేసినట్లు తెలిసింది. అలాగే, అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Bigg Boss 7 : ‘నువ్వు కంటెండర్‌వి కాదు. నిన్నెందుకు పిలుస్తారు..’ నాగార్జున ఫైర్‌

ట్రెండింగ్ వార్తలు