తమిళ స్టార్ హీరో ధనుష్ నుంచి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు రావడం లేదు. అందుకే నెక్స్ట్ సినిమా సౌత్ లోనే ఎవరు చేయని ప్రయోగంలా ఉండాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విలన్ గా టాలీవుడ్ కుర్ర హీరోని ధనుష్ ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్.
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్రకు కు…ఆ చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సరైన సక్సెస్ సాధించలేకపోతే ఇతర కీలక పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపుతుంటారు. నవీన్ చంద్ర కూడా అదే చేస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో సైడ్ విలన్ గా నటించిన నవీన్ చంద్ర ..ధనుష్ ,దొరై సెంథిల్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘అసురన్’ అనే సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడని సమాచారం. అందాల రాక్షసి లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీలో మెప్పించిన నవీన్ చంద్ర ప్రస్తుతం విలన్ పాత్రల్లో నటిస్తుండడం ఆసక్తిగా మారింది.
తాజాగా తమిళనాడులో జరుగుతున్న ఒక చిత్ర షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నవీన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు ధనుష్ సినిమా షూటింగ్ లో తీసినవే అని కొందరు అంటున్నారు. తమిళ చిత్రాల్లో నటించడం నవీన్ కు ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే చాలా తమిళ సినిమాల్లో కనిపించాడు. కానీ ధనుష్ లాంటి స్టార్ తో సినిమా కాబట్టి కచ్చితంగా తమిళ ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని ఫ్యాన్స్ నమ్మకం.