×
Ad

Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ ట్విట‌ర్ రివ్యూ.. న‌వ్వించేస్తున్న నవీన్ పోలిశెట్టి

అనగనగా ఒక రాజు చిత్రాన్ని చూసిన ప్రేక్ష‌కులు త‌మ స్పంద‌న‌ను (Anaganaga Oka Raju Twitter Review) సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తున్నారు.

Naveen Polishetty Anaganaga Oka Raju Twitter Review

Anaganaga Oka Raju : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు. మారి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ మూవీని నిర్మించారు. చమ్మక్ చంద్ర, రావు రమేష్ లు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా నేడు (జ‌న‌వ‌రి 14) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే ప‌లు చోట్ల షోలు ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని చూసిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు. న‌వీన్ కామెడీ అదిరిపోయింద‌ని చెబుతున్నారు. గోదారోళ్ల ఎటకారం పంచులు హైలెట్‌గా ఉన్నాయ‌ని కామెంట్లు చేస్తున్నారు.

Ankita : అమ్మబాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్ అంకిత‌.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?