×
Ad

Miss Shetty Mr Polishetty Trailer : పెళ్లి వద్దు గాని ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ కావాలి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్..

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటిస్తున్న లవ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

  • Published On : August 21, 2023 / 06:49 PM IST

Naveen Polishetty Anushka Shetty Miss Shetty Mr Polishetty Trailer release

Miss Shetty Mr Polishetty Trailer : యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకి పి.మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్.. తాజాగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

Akira Nandan : అకీరా నందన్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు.. వెంటనే డెలీట్ చేశారు.. ఎందుకు..?

ట్రైలర్ చూస్తుంటే ఇప్పటి జనరేషన్ లో జరుగుతున్న సహజీవనం అంశాన్ని తీసుకోని కామెడీ నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు ఉంది. తన కాళ్ళ మీద తాను నిలబడే వ్యక్తిత్వం ఉండే హీరోయిన్.. కేవలం తల్లి అవ్వడానికి మాత్రమే మగాడి హెల్ప్ కావాలి అని నమ్ముతుంది. ఈక్రమంలోనే తాను ప్రెగ్నెంట్ అవ్వడానికి హీరో హెల్ప్ అడగడం.. ఆ తరువాత జరిగే ఎమోషనల్ రైడర్ ని థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిందే. ఇక ట్రైలర్ లో ‘పెళ్లి వద్దు గాని ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ కావాలి’ అనే కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

G.O.A.T Glimpse : మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళి.. తరువాత నేనే అంటున్న సుడిగాలి సుధీర్.. గోట్ గ్లింప్స్ అదుర్స్..

కాగా ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఆగష్టు రిలీజ్ అంటూ ప్రకటించినా మళ్ళీ పోస్ట్‌పోన్ చేసి సెప్టెంబర్ కి మార్చారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. రధాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. న‌వీన్ అండ్ అనుష్క క్రేజీ కాంబినేషన్ కావడం, స్టోరీ కూడా ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు ఉండడంతో మూవీ పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.