×
Ad

Navya Naveli : అమితాబ్ బచ్చన్ మనవరాలు.. బాలీవుడ్ రమ్మన్నా నో చెప్పి.. ట్రాక్టర్స్ బిజినెస్ లోకి..

అమితాబ్ మనవరాలు నవ్య నవేలి సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో యాక్టివ్ గానే ఉంటుంది. (Navya Naveli)

Navya Naveli

Navya Naveli : బాలీవుడ్ లో ఈ మధ్య వారసులు ఎక్కువైన సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్స్ కూతుళ్లు, కొడుకులు, మనవళ్ళు బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది డైరెక్షన్, వివిధ క్రాఫ్ట్స్ లోకి వెళ్తున్నారు. కానీ బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మనవరాలు మాత్రం బాలీవుడ్ వద్దని బిజినెస్ లోకి వెళ్ళింది. అది కూడా ట్రాక్టర్స్ బిజినెస్ లోకి..(Navya Naveli)

అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ బిజినెస్ మెన్ నిఖిల్ నందని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. శ్వేత కూతురు, అమితాబ్ మనవరాలు నవ్య నవేలి సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో యాక్టివ్ గానే ఉంటుంది. అమితాబ్ కూడా పలుమార్లు ఆమెతో ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసారు. నవ్య గతంలో పారిస్ లోరెల్ ఫ్యాషన్ వాక్ లో కూడా పాల్గొంది. దానికి అంబాసిడర్ గా కూడా ఉంది. అప్పుడే నవ్యకి కూడా బాలీవుడ్ సినిమాల నుంచి ఆఫర్స్ వచ్చాయి.

Also Read : Mahesh Babu : బాహుబలి రిలీజ్ బిజీలో రాజమౌళి.. ఈ గ్యాప్ లో సముద్రంలో సాహసాలు చేస్తున్న మహేష్.. పోస్ట్ వైరల్..

కానీ నవ్య బాలీవుడ్ వద్దనుకుంది. నవ్య తండ్రి, తాతలది పెద్ద బిజినెస్. అగ్రికల్చర్ పరికరాలు చేసే బిజినెస్. Escorts Kubota Limited అనే కంపెనీ నడిపిస్తున్నారు. వీళ్లకు ఫార్మ్ ట్రాక్టర్స్ అనే ట్రాక్టర్స్ బిజినెస్ కూడా ఉంది. ఇటీవల నవ్య ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నాకు ఒక రంగానికి ఫిక్స్ అవ్వాలని ఉండదు. అన్నిట్లోనూ ఉంటాను. నేను చిన్నప్పట్నుంచి ఇంట్లో అగ్రికల్చర్ పరికరాలు గురించి, ట్రాక్టర్స్ గురించి వింటూ పెరిగాను. నేను ఒక ట్రాక్టర్ ని ఇప్పదీసి మొత్తం బిగించగలను. నాకు ట్రాక్టర్స్ గురించి అంతా తెలుసు. అందుకే మా నాన్న, తాతయ్యల బిజినెస్ లోకి వెళ్లి ఆ లెగసీని మరింత ముందుకు తీసుకెళాలి అనుకుంటున్నాను అని తెలిపింది.

నవ్య ఓ వైపు తండ్రి బిజినెస్ లో భాగమైంది. మరోవైపు ఫ్యాషన్ ర్యాంప్ వాక్స్ లో పాల్గొంటుంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. జెండర్ ఈక్వాలిటీ కోసం పని చేస్తుంది. ఇవే కాకుండా IIM అహ్మదాబాద్ లో బిజినెస్ డిగ్రీ చేస్తుంది. తమ కంపెనీలో మూడేళ్లు ఇంటర్న్షిప్ కూడా చేసింది. తనకి భవిష్యత్తులో తండ్రి, తాత లాగే అగ్రికల్చర్ సెక్టార్ లో వర్క్ చేయాలని, బిజినెస్ లో ఎదగాలని ఉందని చెప్పింది. ఇప్పటికే బిజినెస్ లో పలు అవార్డులు కూడా అందుకుంది నవ్య. నవ్యకి తమ తండ్రి కంపెనీలో 0.02 శాతం స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటి వ్యాల్యూ దాదాపు 7 కోట్లు. అమితాబ్ లాంటి స్టార్ డమ్ ఉన్నా బాలీవుడ్ కి నో చెప్పి ఇలా తండ్రి బిజినెస్ వైపు అడుగులు వేసి దూసుకెలుతుంది నవ్య నవేలి.

Also Read : Rajamouli – Prabhas : రాజమౌళి ఆఫర్ ఇచ్చినా సినిమా చేయని ప్రభాస్.. హ్యాపీగా రెస్ట్ తీసుకొని..