Mahesh Babu : బాహుబలి రిలీజ్ బిజీలో రాజమౌళి.. ఈ గ్యాప్ లో సముద్రంలో సాహసాలు చేస్తున్న మహేష్.. పోస్ట్ వైరల్..

రాజమౌళి - మహేష్ బాబు సినిమా షూటింగ్ కి బాహుబలి వల్ల బ్రేక్ పడింది.(Mahesh Babu)

Mahesh Babu : బాహుబలి రిలీజ్ బిజీలో రాజమౌళి.. ఈ గ్యాప్ లో సముద్రంలో సాహసాలు చేస్తున్న మహేష్.. పోస్ట్ వైరల్..

Mahesh Babu

Updated On : October 30, 2025 / 8:01 AM IST

Mahesh Babu : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం కెన్యా, టాంజానియా దేశాల్లో షూట్ చేసి వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి బాహుబలి వల్ల బ్రేక్ పడింది.(Mahesh Babu)

రాజమౌళి రెండు బాహుబలి సినిమాలను కలిపి ఒకే సినిమాగా బాహుబలి ఎపిక్ అని అక్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నారు. గత నెల రోజులుగా రాజమౌళి ఈ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. దీంతో మహేష్ బాబుకి గ్యాప్ దొరికింది. మహేష్ కాస్త గ్యాప్ దొరికితేనే ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తాడని తెలిసిందే. రాజమౌళి సినిమా మొదలయ్యాక షూటింగ్ కి తప్ప మహేష్ ఎక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు. ఇప్పుడు బాహుబలి తో రాజమౌళి బిజీగా ఉండటంతో మహేష్ వెకేషన్ కి వెళ్లారు.

Also Read : Rajamouli – Prabhas : రాజమౌళి ఆఫర్ ఇచ్చినా సినిమా చేయని ప్రభాస్.. హ్యాపీగా రెస్ట్ తీసుకొని..

మహేష్ బాబు ఇటీవల మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. తాజాగా మహేష్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. మాల్దీవ్స్ సముద్రంలో ఉండి ఫేస్ కనిపించకుండా ఫోటో షేర్ చేసాడు మహేష్. ఈ ఫోటో షేర్ చేస్తూ.. చాలా ఆనందంగా అంది. ఉండటానికి మంచి ప్లేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ ఫోటో చూస్తుంటే మహేష్ సముద్రం మధ్యలోఉన్న హోటల్ లో బస చేసినట్టు తెలుస్తుంది. దీంతో మహేష్ పోస్ట్ వైరల్ అవ్వగా సముద్రంలో సాహసాలు చేస్తున్నావేంటి బాబు జాగ్రత్త అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

వచ్చే నెలలో మళ్ళీ రాజమౌళి – మహేష్ సినిమా షూటింగ్ మొదలవ్వనున్నట్టు సమాచారం. రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాశీ సెట్ లో షూటింగ్ జరగనుంది.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Also Read : Rajamouli : బాహుబలి డిజాస్టర్ టాక్.. పార్ట్ 2 చూసి నిద్ర రావడంతో అది కూడా ఫ్లాప్ అనుకున్న రాజమౌళి..