సూపర్ స్టార్ రజనీకాంత్ 168లో లేడి సూపర్ స్టార్ నయనతార..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రజినీ నటిస్తున్న 168వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా లేడి సూపర్ స్టార్ నయనతార ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరైంది. ఈ చిత్రంలో నయనతార ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇది రజనీతో నయన్ నటిస్తున్న అయిదవ సినిమా కావడం విశేషం. ‘రోబో’, ‘పేట’ మూవీస్ తర్వాత సన్ పిక్చర్స్ సంస్థ రజనీతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం కూడా ఇదే.
Read Also : బాబోయ్.. రష్మిక రెచ్చిపోయిందిగా!
ఇంతకుముందు ‘చంద్రముఖి’ (2005), ‘శివాజీ’ (2007) ప్రత్యేకగీతం, ‘కథానాయకుడు’ (2008) ప్రత్యేకగీతం, ‘దర్బార్’ (2019), ‘తలైవర్ 168 (2020).. త్వరలో నయనతార షూటింగులో పాల్గొనబోతుంది. తల అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి వరుస హిట్ సినిమాలు తీసి ఊపు మీద ఉన్న శివ, రజనీని సరికొత్త స్టైల్‌లో చూపించనున్నాడని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి సంగీతం : డి.ఇమాన్.
Lady Superstar #Nayanthara joins the cast of #Thalaivar168@rajinikanth @directorsiva pic.twitter.com/RtofFJKCG5
— Sun Pictures (@sunpictures) January 31, 2020