నయనతార నటవిశ్వరూపం.. దొంగబాబాల అంతం.. అదే అమ్మోరు తల్లి పంతం..

  • Publish Date - October 25, 2020 / 09:25 PM IST

Nayanthara: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార ఆదిశక్తి అవతారంలో నటించిన Mookuthi Amman చిత్రం తెలుగులో తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదల కానుంది. నయనతార తొలిసారి అమ్మవారి పాత్రలో నటించిన ఈ సినిమాతో కోలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న RJ బాలాజీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

దసరా కానుకగా ‘అమ్మోరు తల్లి’ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ‘‘నటుడు RJ బాలాజీ దర్శకుడిగా మారి రూపొందించిన ‘అమ్మోరు తల్లి’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అతనితో పాటు చిత్రంలో నటించిన నయనతార ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు. దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది..’’ అని మహేష్‌ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఈ సినిమాను ఓటీటీ వేదికగానే విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. దీపావళి సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.