NBK 111 Glimpse : OG సినిమాని గుర్తుచేస్తున్న బాలయ్య కొత్త సినిమా గ్లింప్స్.. జస్ట్ మ్యూజిక్ మారిస్తే చాలు..

ఈ సినిమా గ్లింప్స్ బాగున్నప్పటికీ ఇది OG సినిమాని, OG సినిమా గ్లింప్స్ ని గుర్తు చేస్తుంది. (NBK 111 Glimpse)

  • Published on- June 10, 2026 / 06:44 PM IST

NBK 111 Glimpse

NBK 111 Glimpse : నేడు బాలకృష్ణ కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు బాలయ్య బాబు పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో బాలయ్య సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపించి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చారు.

అయితే ఈ సినిమా గ్లింప్స్ బాగున్నప్పటికీ ఇది OG సినిమాని, OG సినిమా గ్లింప్స్ ని గుర్తు చేస్తుంది. పవన్ కెరీర్ లో స్టైలిష్ మాఫియా సినిమాగా వచ్చిన OG మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులోని విజువల్స్, పవన్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు బాలయ్య బాబుని కూడా గోపీచంద్ అలాగే చూపించబోతున్నాడని తెలుస్తుంది.

Also Read : NBK 111 Glimpse : బాలయ్య బాబు NBK 111 సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. బాలయ్య స్టైలిష్ అవతారం..

బాలయ్య NBK111 గ్లింప్స్ లో 1993, ముంబైలో కథ అని చెప్పి ముంబై షాట్స్ చూపించారు అవి అచ్చం OG సినిమా షాట్స్ లానే ఉన్నాయి. బాలయ్య వర్షంలో షాట్స్, నడిచేటప్పుడు కాలు షాట్స్, కత్తి పట్టుకొని ఉన్న షాట్, పవన్ కటానా పట్టుకొని ఓ వీధిలో ఫైట్ చేసిన సీన్ కి తగ్గట్టు అదే వీధిలో బాలయ్య బాబు ఫైట్, బైక్ పై బాలయ్య స్టైలిష్ గా గన్ పట్టుకొని రావడం.. ఇలా ప్రతి సీన్, షాట్, ముఖ్యంగా కలర్ టోన్ OG సినిమానే గుర్తుచేస్తున్నాయి.

ఇక గ్లింప్స్ చివర్లో బాలయ్య ప్రొక్లైన్ ఎక్కి రావడం సలార్ సినిమా ఇంటర్వెల్ సీన్ గుర్తు చేస్తుంది. OG లో పవన్ లాగే ఇందులో కూడా బాలయ్య మాఫియా బ్యాక్ డ్రాప్ లో కనిపించబోతున్నాడని సమాచారం. దీంతో ఈ సినిమాని OG తో కంపేర్ చేస్తున్నారు. ఈ సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం, ఈ గ్లింప్స్ కి ఇచ్చిన మ్యూజిక్ కూడా కొంచెం OG కి దగ్గరగా ఉండటంతో కొంతమంది నెటిజన్లు ఇదే బాలయ్య గ్లింప్స్ కి OG మ్యూజిక్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ గ్లింప్స్ OG సినిమాని చూసి ప్రేరణగా తీసుకొని తీసినట్టు ఉంది అంటున్నారు.

Also Read : Maa Behen : ‘మా బెహన్’ మూవీ రివ్యూ.. తల్లి, ఇద్దరు కూతుళ్లు కలిసి ఏం చేశారు..