NBK107: బాలయ్యకు రాయల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన NBK107 టీమ్!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్....
- Anil Aaleti
- Published on- June 10, 2022 / 11:02 AM IST
Nbk107 Team Wishes Balakrishna With A New Poster
NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక నేడు(జూన్ 10) బాలయ్య పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో బాలయ్య ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాడు. ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు బర్త్‌డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా.. బాలయ్య నటిస్తున్న NBK107 టీమ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్‌ప్యాక్డ్ టీజర్‌ను రిలీజ్ చేసింది.
Balakrishna : భయం మా బయోడేటాలోనే లేదు.. NBK 107 టీజర్ రిలీజ్..
ఈ టీజర్‌కు ప్రేక్షకుల దగ్గర్నుండి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. ఇక నేడు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా NBK107 టీమ్ ఆయనకు మరో కొత్త పోస్టర్ ద్వారా తమ విషెస్ తెలియజేశారు. ఈ పోస్టర్లో బాలయ్య లుక్ చాలా రాయల్‌గా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కేవలం పోస్టర్స్, టీజర్‌తోనే ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ కావడంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.
NBK107: గెట్ రెడీ.. బాలయ్య వచ్చేస్తున్నాడు!
ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లు నిన్న వదిలిన టీజర్లోనే మనకు అర్థం అయ్యింది. అంతేగాక నందమూరి అభిమానులు బాలయ్య నుండి కోరుకునే పవర్ఫుల్ డైలాగులకు ఈ సినిమాలో ఎలాంటి కొరత లేదని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందింస్తున్నాడు.
