NBK107: గెట్ రెడీ.. బాలయ్య వచ్చేస్తున్నాడు!

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను....

NBK107: గెట్ రెడీ.. బాలయ్య వచ్చేస్తున్నాడు!
ad

NBK107: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాగా.. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ హంట్ అంటూ ఓ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేసే డేట్ అండ్ టైమ్ లాక్ చేసింది చిత్ర యూనిట్.

NBK107: బాలయ్య అలాంటి డైలాగులు చెబుతాడా?

బాలయ్య సినిమాకు సంబంధించిన టీజర్‌ను జూన్ 9 సాయంత్రం 6.11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాలో బాలయ్య గెటప్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే చిత్ర యూనిట్ పోస్టర్స్ ద్వారా రివీల్ చేసింది. ఇక ఇప్పుడు టీజర్‌ను రిలీజ్ చేస్తుండటంతో, బాలయ్య అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ టీజర్ అప్‌డేట్‌ను ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో పులిచర్ల 4 కి.మీ అనే మైలురాయికి ఆనుకొని ఓ గొడ్డలిని పెట్టారు. ఈ మైలురాయిపై రక్తపు మరకలు చూపించారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో, ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పేసింది చిత్ర యూనిట్.

NBK107: మొదటి వేటను లోడ్ చేస్తున్న బాలయ్య

ఇక టీజర్‌లో బాలయ్య డైలాగులు ఏమైనా చూపిస్తారా.. ఈ టీజర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి బాలయ్య 107వ చిత్రానికి ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారో చూడాలి.