NBK107: బాలయ్య అలాంటి డైలాగులు చెబుతాడా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా...

NBK107: బాలయ్య అలాంటి డైలాగులు చెబుతాడా?

Balakrishna Dialogues To Shock Everyone In Nbk107

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ బాలయ్య పుట్టినరోజు కానుకగా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బాలయ్య అభిమానులకు కావాల్సినంత ఎనర్జీ ఇచ్చాడు.

NBK107: మొదటి వేటను లోడ్ చేస్తున్న బాలయ్య

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. బాలయ్య కెరీర్‌లో వస్తున్న 107వ సినిమాగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ ప్రెస్టీజియస్‌గా తీసుకుంది. కాగా.. ఈ సినిమాలో బాలయ్య చెప్పే డైలాగులు గతంలో ఎప్పుడూ ఆయన నోటివెంట వినని విధంగా ఉండబోతున్నాయట. ఆయన ఈ సినిమాలో బోల్డ్ డైలాగులతో పాటు డబుల్ మీనింగ్ డైలాగులు బోలెడు చెప్పనున్నట్లు తెలుస్తోంది. అయితే కథలోని పాత్ర డిమాండ్ మేరకే దర్శకుడు గోపీచంద్ ఇలాంటి డైలాగులు రాసుకున్నాడని.. బాలయ్య కూడా వాటికి నో చెప్పకుండా, తనదైన స్టయిల్‌లో ఆ డైలాగులను చెప్పాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!

ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, బాలయ్య సరసన ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు ‘‘జై బాలయ్య’’ లేదా ‘‘అన్నగారు’’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు టైటిల్స్‌లో బాలయ్య దేనికి సై అంటాడో చూడాలి.