Neha Shetty : టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంది. ఇండస్ట్రీలో ఈ అమ్మడికి ఫేమ్ తెచ్చిపెట్టిన సినిమా అంటే.. డీజే టిల్లు. ఆ మూవీలో రాధికగా కనిపించి యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. కాగా డీజే టిల్లు మూవీ రిలీజ్ సమయంలో ఈ భామకి, ఒక జర్నలిస్ట్ కి మధ్య ఒక వివాదం వచ్చింది. మూవీ ప్రమోషన్స్ లో ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి హీరో సిద్దు జొన్నలగడ్డతో.. “హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో రియల్ గా తెలుసుకున్నారా?” అనే వివాదాస్పద క్వశ్చన్ అడిగాడు.
ఇక ఆ విషయం పై నేహశెట్టి రియాక్ట్ అవుతూ ఒక కౌంటర్ ట్వీట్ వేసింది. “ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న ఆడవారికి ఎంత గౌరవం ఇస్తునాడో ఈ క్వశ్చన్ తో అర్థమైంది. అతని పద్ధతి మార్చుకొని అందరిని గౌరవించాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేసింది. ఇక దీనికి రియాక్ట్ అవుతూ సురేష్ కొండేటి.. క్షమాపణలు అడుగుతూ ట్వీట్ చేశాడు. ఆ వివాదంతోనే సురేష్ కొండేటి బాగా వైరల్ అయ్యిపోయాడు.
sorry neha that was really unfortunate…
— Naga Vamsi (@vamsi84) February 2, 2022
It wasn’t meant to insult/embarrass you at all. I would like to apologise for the trouble caused. @iamnehashetty
— Suresh Kondeti (@santoshamsuresh) February 2, 2022
ఆ తరువాత కూడా పలు ప్రెస్ మీట్స్ లో పలు వైరల్ క్వశ్చన్స్ అడుగుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చాడు. ఈమధ్యన ఫేమ్ ఎలా వచ్చిందనేది పక్కన బెడితే.. వచ్చిన పాపులారిటీని తమ ప్రమోషన్స్ కి ఉపయోగించుకోవడం బాగా అలవాటు అయ్యిపోయింది ప్రతి ఒక్కరికి. ఈనేపథ్యంలోనే సురేష్ కొండేటికి వచ్చిన ఫేమ్ ని ఉపయోగించుకొని పలువురు స్టార్స్ తో ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు.
Also Read : Chiranjeevi : చిరంజీవి మొదలుపెట్టిన ఆ మంచి పనికి 25 ఏళ్ళు.. మెగా బాస్ ఎమోషనల్ పోస్ట్..
దీంతో ప్రతి మూవీ ఈవెంట్ లో సురేష్ కొండేటి కనిపిస్తున్నాడు. తాజాగా నేహశెట్టి నటించిన ‘రూల్స్ రంజన్’ ఈవెంట్ లో కూడా సురేష్ కొండేటి కనిపించాడు. అంతేకాదు ఈ ఈవెంట్ లో నేహాతో కలిసి డాన్స్ వేసి మరోసారి వైరల్ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంటే, అది చూసిన నెటిజెన్స్.. అప్పుడు గొడవ ఇప్పుడు కలిసి డాన్సా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#TFNReels: Stunning beauty @iamnehashetty grooves to the chartbuster #Sammohanuda song along with journalist #SureshKondeti!!?? #KiranAbbavaram #RulesRanjann #TeluguFilmNagar pic.twitter.com/wCzsU3Nqid
— Telugu FilmNagar (@telugufilmnagar) October 1, 2023