Chiranjeevi : చిరంజీవి మొదలుపెట్టిన ఆ మంచి పనికి 25 ఏళ్ళు.. మెగా బాస్ ఎమోషనల్ పోస్ట్..

ఆ మంచి పనికి 25 ఏళ్ళు పూర్తి అయ్యింది. చిరు చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.

Chiranjeevi : చిరంజీవి మొదలుపెట్టిన ఆ మంచి పనికి 25 ఏళ్ళు.. మెగా బాస్ ఎమోషనల్ పోస్ట్..

Chiranjeevi emotional post on 25 years of Chiranjeevi Charitable Trust

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తన డాన్స్‌లు, ఫైట్స్, యాక్టింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడో బయట తను చేసే సేవ కార్యక్రమాలతో అంతకు మించి అభిమానాన్ని అందిపుచ్చుకున్నాడు. చిరంజీవి సేవ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటే అందరికి ముందు గుర్తుకు వచ్చేది.. ‘బ్లడ్ బ్యాంక్’. చిరు మొదలుపెట్టిన ఈ కార్యం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం అయ్యింది. ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది.

19’s టైములో.. సమయానికి రక్తం లభించక ఎంతోమంది చనిపోయేవారు. ఇలాంటి సంఘటనలు చూసిన చిరంజీవికి ఒక ఆలోచన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు తన పై ఎంతో ప్రేమని చూపిస్తుంటారు. ఆ ప్రేమని ప్రజల ప్రయోజనాలు కోసం ఉపయోగించాలని భావించాడు. అలా పుట్టుకొచ్చిందే ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’. 1998 అక్టోబర్ 2న ఈ ట్రస్ట్ ని చిరంజీవి స్థాపించాడు.

Also Read : Devara : ఎన్టీఆర్ దేవర షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రత్నవేలు.. నడి సముద్రంలో..

అక్కడి మొదలైన ప్రయాణం ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ అంటూ ప్రజాశ్రేయస్సు కోరుతూ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ జూబిలీహిల్స్ లో ఉన్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ క్యాంపుని 2006లో అప్పటి భారత అధ్యక్షుడు ఏ పి జె అబ్దుల్ కలామ్ ప్రారంభించారు. ఈ ట్రస్ట్ నుంచి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ బ్లడ్ ని కలెక్ట్ చేసి అవసరమైన వారికీ అందించారు.

అలాగే కంటి చూపుతో బాధపడుతున్న 10 వేల మంది ప్రజలకు ట్రస్ట్ ద్వారా సహాయం అందించారు. ఇక కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి వేలమంది బ్రతుకుల్లో వెలుగు నింపారు. నేటితో (అక్టోబర్ 2) ఈ ట్రస్ట్ ప్రారంభించి 25 ఏళ్ళు పూర్తి అవ్వడంతో చిరంజీవి.. ఈ జర్నీ గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ వేశాడు. దేశానికీ తనవంతు చేసే ఈ సాయం గాంధీజీకి తను ఇచ్చే నివాళులు అని తెలియజేశాడు.