Netflix CEO Ted Sarandos Meet with Mahesh Babu and Trivikram in Guntur Kaaram Sets
Mahesh Babu : నెట్ ఫ్లిక్స్(Netflix) CEO టెడ్ సరండోస్(Ted Sarandos) ఇండియాకు రాగా టాలీవుడ్ లో వరుసగా స్టార్స్ అందర్నీ కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్న మెగాస్టార్ ఫ్యామిలీని కలిసి, చిరంజీవి ఇంట్లో లంచ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్కీలతో కలిసి మాట్లాడారు టెడ్ సరండోస్. నిన్న నందమూరి ఫ్యామిలీని కలిసి ఎన్టీఆర్ ఇంట్లో లంచ్ చేసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల శివతో ముచ్చటించారు.
మెగా, నందమూరి ఫ్యామిలీలను టెడ్ సరండోస్ కలవడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ లో భవిష్యత్తులో గ్రాండ్ గా ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో, ఎన్టీఆర్, చరణ్ లతో ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారేమో అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు టెడ్ సరండోస్ సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశాడు.
నేడు గుంటూరు కారం సెట్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ ని కలిశారు నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్. మహేష్ వారితో కలిసి దిగిన ఫోటోనో సోషల్ మీడియాలో షేర్ చేసి.. నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ తో పాటు అతని టీం మోనికా షెర్గిల్, అభిషేక్ గోరాడియాలతో ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
Also Read : Ted Sarandos with NTR & Charan : మెగా నందమూరి ఫ్యామిలీలతో నెట్‌ఫ్లిక్స్ CEO మీటింగ్.. ఫొటోలు
వరల్డ్ టాప్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ CEO టాలీవుడ్ మీటింగ్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సడెన్ గా ఇండియాకి వచ్చిన టెడ్ సరండోస్ టాలీవుడ్ కి వచ్చి మెగా, నందమూరి ఫ్యామిలీలను, మహేష్ బాబుని కలవడం, వారితో లంచ్ చేయడం, ఫోటోలు దిగడంతో నెట్ ఫ్లిక్స్ టాలీవుడ్ లో గట్టిగా ఏదైనా ప్లాన్ చేస్తుందా? లేదా మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళారా? నెట్ ఫ్లిక్స్ లో టాలీవుడ్ స్టార్స్ తో ఏదైనా సిరీస్ ప్లాన్ చేస్తున్నారా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇంకా ఎవర్నైనా కలుస్తారా? బాలీవుడ్ లో ఎవర్నైనా కలుస్తారా?.. లాంటి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనేమో. ప్రస్తుతానికి నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ టాలీవుడ్ మీటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి.
Coffee and chill!!
Some interesting conversations about the future of entertainment with the visionary #TedSarandos and his fabulous team #MonikaShergill #AbhishekGoradia@NetflixIndia pic.twitter.com/lpoXqMWz05— Mahesh Babu (@urstrulyMahesh) December 9, 2023