Salman Khan : స్టేజి పై సిగరెట్‌తో కనిపించిన సల్మాన్‌ఖాన్‌.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్.. పిక్ వైరల్!

పబ్లిక్ స్టేజి పై చేతిలో సిగరెట్‌తో కనిపించి నెటిజెన్స్ నుంచి సల్మాన్ ఖాన్ తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నాడు.

netijens fire on Salman Khan due to bigg boss ott 2

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక పక్క సినిమాలు మరో పక్క టెలివిజన్ షోలు చేస్తూ ఆడియన్స్ ని గ్యాప్ లేకుండా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఈ హీరో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ మొదలైంది. ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి నెటిజెన్స్ నుంచి ఏదో విషయంలో తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది.

Madhavi Latha : బిగ్‌బాస్ సీజ‌న్ 7 ఆఫ‌ర్ నిజ‌మే.. టాలీవుడ్ హీరోయిన్ మాధ‌వీల‌త‌.. ఇప్ప‌టికీ మూడు సార్లు..

జైద్ హదీద్ తన తోటి కంటెస్టెంట్ ఆకాంక్ష పూరితో అసభ్యకరంగా ప్రవర్తించడం వివాదం అయితే, ఆ తరువాత వారిద్దరి లిప్ కిస్ చేసుకోవడం ప్రేక్షకులను ఆగ్రహానికి గురి చేసింది. తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన ఒక పని పై నెటిజెన్స్ ఫస్ అవుతున్నారు. ఈ శనివారం (జులై 8) కంటెస్టెంట్స్ ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్.. హౌస్ లో ఉన్నవారి తప్పొప్పులను చూపించి కౌంటర్స్ ఇచ్చాడు. అయితే ఇదే సమయంలో సల్మాన్ చేతిలో సిగరెట్‌తో ఉన్నాడు అంటూ ఒక పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

Ileana : తొమ్మిదో నెల గర్భంతో ఇలియానా.. చాలా అలసటగా ఉందంటూ పోస్ట్..!

ఇక ఆ ఫోటో చూసిన నెటిజెన్స్.. “కంటెస్టెంట్స్ తప్పొప్పులు చూపే ముందు, మీరు మారండి” అంటూ సల్మాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. “ఒక సెలబ్రిటీ స్టేజిలో ఉన్న వ్యక్తే ఇలా పబ్లిక్ గా సిగరెట్‌ కాల్చి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు” అంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. మరి దీని పై సల్మాన్ మరియు షో నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇక సల్మాన్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం టైగర్ 3 (Tiger 3) సినిమాలు నటిస్తున్నాడు. మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ ఏడాది నవంబర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

netijens fire on Salman Khan due to bigg boss ott 2