Adipurush: ఆదిపురుష్ నుండి కొత్త పోస్టర్.. సీతగా ఆకట్టుకుంటున్న కృతి సనన్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ నుండి సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ కు సంబంధించిన కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.
- Anil Aaleti
- Published On : April 29, 2023 / 11:07 AM IST
New Poster Of Kriti Sanon From Adipurush Revealed
Adipurush: ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తుండగా, రామాయాణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఎపిక్ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.
Adipurush: హాలీవుడ్ మూవీతో పాటు వస్తున్న ‘ఆదిపురుష్’ ట్రైలర్..?
ఈ సినిమా నుండి ఇటీవల వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఇవాళ(ఏప్రిల్ 29) సీతా నవమి కావడంతో ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. సీతగా కృతి సనన్ లుక్ అదిరిపోయింది. సహనానికి మారుపేరు అయిన సీత పాత్రలో కృతి సనన్ ఒదిగిపోయిందని అభిమానులు అంటున్నారు. ఇక సీత పాత్రలో కృతి సనన్ ఈ సినిమాలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందా.. ఆమెకు ఈ సినిమా ఎలాంటి పేరును తీసుకొస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
Adipurush : ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ క్రేజ్ మాములుగా లేదుగా..
ప్రభాస్ రాముడిగా చేస్తున్న సినిమా కావడంతో ఆదిపురుష్ పై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో నెలకొన్నాయి.ఈ సినిమాలో లంకేశ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. జూన్ 16న ఆదిపురుష్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.
सीता राम चरित अति पावन
The righteous saga of Siya Ram
Jai Siya Ram
जय सिया राम
జై సీతారాం
ஜெய் சீதா ராம்
ಜೈ ಸೀತಾ ರಾಮ್
ജയ് സീതാ റാം#Adipurush #SitaNavmi #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage… pic.twitter.com/OE89q186RU— T-Series (@TSeries) April 29, 2023
