Adipurush : ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ క్రేజ్ మాములుగా లేదుగా..

ట్రిబెకా ఫెస్టివల్ లో రిలీజ్ కి ముందే ఆదిపురుష్ ని ప్రీమియర్ వేస్తున్న సంగతి తెలిసిందే.

Adipurush : ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ క్రేజ్ మాములుగా లేదుగా..

Prabhas Adipurush premiered at Tribeca Festival in three shows

Updated On : April 26, 2023 / 7:39 PM IST

Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మైథాలిజికల్ మూవీ ఆదిపురుష్. రామాయణం కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో భారీ ట్రోలింగ్ కి గురి కావడంతో సినిమా రిలీజ్ వాయిదా వేసుకొని బెటర్ అవుట్ పుట్ తో వచ్చేందుకు వెన్నకి వెళ్లారు. VFX వర్క్స్ మెరుగు పరుచుకొని జూన్ 16న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ మేకర్స్ తెలియజేసిన సంగతి తెలిసిందే. విడుదల దగ్గర పడుతుండడంతో మూవీ టీం ఇటీవలే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.

Salaar: అక్కడ బ్రేక్ ఈవెన్ రావాలంటే ‘సలార్’ ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

కాగా ఈ చిత్రానికి ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. జూన్ 7 నుంచి 18 వరకు న్యూయార్క్ లో జరగబోయే ట్రిబెకా ఫెస్టివల్ (Tribeca Film Festival) లో ఆదిపురుష్ ప్రీమియర్ వేయనున్నారు. జూన్ 13న ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫెస్టివల్ లో ఆదిపురుష్ కి వస్తున్న క్రేజ్ చూస్తుంటే మాములుగా లేదు. ఆ సినిమా చూసేందుకు ఆడియన్స్ నుంచి డిమాండ్ పెరగడంతో ఒక షోని కాస్త మూడు షోలను చేశారు. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 13, 14, 15 తేదీల్లో ప్రీమియర్ షోలు వేయనున్నారు.

ఇక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్రభాస్ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసిన అతని అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ విషయంలో నెగటివిటీ సంపాదించుకున్న ఆదిపురుష్ కి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ఇటువంటి ఆదరణ వస్తుండడంతో మూవీ పై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. కాగా ఈ మూవీ ట్రైలర్ ని మే మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. 2D మరియు 3D ఫార్మాట్స్ లో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు.