Adipurush: హాలీవుడ్ మూవీతో పాటు వస్తున్న ‘ఆదిపురుష్’ ట్రైలర్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ ట్రైలర్‌ను హాలీవుడ్ మూవీ ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సి 3’కి అటాచ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.

Adipurush: హాలీవుడ్ మూవీతో పాటు వస్తున్న ‘ఆదిపురుష్’ ట్రైలర్..?

Adipurush Trailer To Come With This Hollywood Biggie

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Adipurush : ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ క్రేజ్ మాములుగా లేదుగా..

కాగా, ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హాలీవుడ్ మూవీ ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సి 3’కి అటాచ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. హాలీవుడ్ మూవీతో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తే, ఈ ట్రైలర్‌కు మంచి రీచ్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌ను ప్రేక్షకులు మెచ్చే విధంగా కట్ చేశారట చిత్ర యూనిట్.

Adipurush Trailer: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తోంది!

ఆదిపురుష్ ట్రైలర్‌లో విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేయనుందని.. ప్రభాస్ రాముడిగా అందరినీ ఆకట్టుకుంటాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.