Adipurush Trailer: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తోంది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Adipurush Trailer: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తోంది!

Adirpurush Trailer On The Way

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుండి మాసివ్ రెస్పాన్స్ లభించింది.

Adipurush: ఆదిపురుష్ నుండి మరో అప్డేట్.. వచ్చేది ఆ రోజే!

ఇక ఈ సినిమాను జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ చేస్తుండటంతో, మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ షురూ చేశారు. ఇటీవల వరుసగా పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ ఆదిపురుష్ టీమ్ సందడి చేస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా నుండి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మే తొలివారంలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని వారు ఆలోచిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Adipurush : రిలీజ్‌కి ముందే ఆదిపురుష్ సినిమా ప్రదర్శన.. గ్లోబల్ స్టేజ్ పై ప్రభాస్ సినిమాకి గౌరవం!

ఇప్పటికే ట్రైలర్‌ను కట్ చేసిన చిత్ర యూనిట్, దీని నిడివిని 3 నిమిషాల 22 సెకన్లుగా ఫిక్స్ చేసిందట. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక గతంలో వచ్చిన టీజర్ కంటే కూడా ఈ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందని.. ఈ ట్రైలర్‌తో ఆదిపురుష్ మూవీపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్‌ల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. మరి నిజంగానే ఆదిపురుష్ ట్రైలర్‌ను మే ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేస్తారా అనేది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ద్వారా తెలియాల్సి ఉంది.