Samantha : సమంత పెళ్లి చేసుకోనట్లేనా? .. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటుందని..

నటి సమంత పెళ్లి చేసుకోదని.. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత?

Samantha

Samantha : ఆ మధ్య సమంత ఇద్దరు చిన్నారులతో ఆడుకుంటున్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  సమంత రెండో పెళ్లి చేసుకోదని ఇద్దరు చిన్నారుల్ని దత్తత తీసుకుంటుందని వార్తలు వచ్చాయి.. సమంత పెళ్లి చేసుకోనట్లేనా?

Naga Vamsi : ‘గుంటూరు కారం’కు ఎలాంటి రివ్యూలు ఇచ్చిన పర్లేదు.. సినిమా బ్లాక్ బస్టర్.. మరోసారి రివ్యూల గురించి చర్చ..

స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా మయోసైటిస్‌తో ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చిన సమంత తిరిగి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే భూటాన్ వెళ్లి ఆయుర్వేద చికిత్స కూడా తీసుకున్నారు. నటిగా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా సేవాగుణంలో తీసిపోనని నిరూపించుకున్నారు సమంత. ప్రత్యూష సపోర్ట్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి పలు అనారోగ్యాలతో బాధపడుతున్న చిన్నారులకు చేయూత అందిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అనేకమంది మహిళలు, చిన్నారులకు అండగా నిలబడ్డారు. త్వరలో సమంత ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంటున్నారని వారి పూర్తి బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ సమంత ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

సమంత, నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోమని సూచించారట. అందుకు సమంత అంగీకరించలేదని.. అసలు ఇంకో పెళ్లి ఆలోచనే లేదని ఆమె ఖచ్చితంగా చెప్పేసినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై కూడా సమంత ఎక్కడా స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం సమంత తనకు మంచి స్నేహితురాలైన గాయని చిన్మయి పిల్లలతో ఆడుకుంటున్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీనిని చూసిన సమంత అభిమానులు ముచ్చట పడ్డారు.

RT4GM : రవితేజ – గోపీచంద్ సినిమా ఆగిపోయిందా? కారణం ఏంటి? ఈ కాంబోలో ఇంకో హిట్ ఉంటుందా?

సమంత నటించిన ‘శాకుంతలం; బిగ్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండతో వచ్చిన ‘ఖుషి’ ఫర్వాలేదనిపించింది. అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ సినిమాల్లో కనిపించాలని నిర్ణయించుకున్న సమంత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కమిట్ అయిన సినిమాలకు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసారు.