Nidhhi Agerwal: తమిళ హీరోతో నిధి ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి?
ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు, గల్లా అశోక్ హీరో సినిమాలలో నటిస్తున్న నిధి అగర్వాల్ ప్రేమలో పడిందా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.
- Naresh Mannam
- Published On : January 8, 2022 / 04:58 PM IST
Nidhhi Agerwal
Nidhhi Agerwal: ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు, గల్లా అశోక్ హీరో సినిమాలలో నటిస్తున్న నిధి అగర్వాల్ ప్రేమలో పడిందా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. గతేడాది ‘ఈశ్వరన్’తో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన నిధి ప్రస్తుతం మరో తమిళ సినిమాలో నటిస్తుంది. అయితే.. తమిళంలో తొలి సినిమాలో నటించిన స్టార్ హీరో శింభుతో నిధి ప్రేమాయణం నడుపుతుందని త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
Pan India Films: పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్.. స్ట్రాటజీ ఏంటంటే?
సుచింద్రన్ దర్శకత్వం వహించిన ఈశ్వరన్ సినిమాలో శింభు హీరో కాగా నిధికి తమిళంలో డెబ్యూ మూవీ. గతేడాది జనవరిలో రిలీజైన ఈ సినిమా ఫలితం ఏమో కానీ ఈ జంట మాత్రం ప్రేమలో మునిగితేలుతుందట. చెన్నైలో షూటింగ్ షెడ్యూల్ ఉంటే నిధి.. శింభు ఇంట్లోనే ఉంటుందని చెప్పుకుంటున్నారు. గత ఏడాది కరోనా టైంలో దగ్గరైన ఈ జంట ఈ ఏడాది షికార్ల వరకు వచ్చిందని.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి త్వరలోనే పెళ్లి చేసుకోవాలని సన్నాహాలలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!
శింభు గతంలో నయనతారతో ప్రేమలో మునిగితేలగా ఆ తర్వాత హన్సికతో కూడా కొన్నాళ్ళు రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ ఇద్దరే కాదు.. కన్నడ నటి హర్షిక, సనాఖాన్, త్రిష, ఆండ్రియా పేర్లు కూడా అప్పట్లో శింభుతో లింక్ పెట్టి వినిపించేవి. ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలో నిధి అగర్వాల్ కూడా చేరింది. మరి ఈ ప్రేమ అయినా తీరానికి చేరుతుందా.. మూడు ముళ్ళతో ఈ జంట ఒక్కటి అవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.
