Nidhhi Agerwal : ప్రభాస్ మారుతి సినిమాలో మరో హీరోయిన్.. నిధి అగార్వల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందా?
మారుతి ప్రభాస్ సినిమాలో మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా చేస్తున్నారని తెలిసిందే. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ అని గతంలోనే వార్తలు వచ్చాయి.
- Saketh U
- Published On : August 22, 2023 / 08:42 AM IST
Nidhhi Agerwal get a chance in Prabhas Maruthi Movie Rumors goes viral
Nidhhi Agerwal : ప్రభాస్(Prabhas) వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో సలార్(Salaar) తో రాబోతున్నాడు, నెక్స్ట్ ఇయర్ కల్కి(Kalki) సినిమాతో రాబోతున్నాడు. వీటి మధ్యలో మారుతితో(Maruthi) ఓ మీడియం రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుటికే ఈ సినిమా కొంతభాగం షూటింగ్ పూర్తయింది. మారుతి ప్రభాస్ సినిమా లొకేషన్ నుంచి ఓ రెండు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.
ఇక మారుతి ప్రభాస్ సినిమాలో మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా చేస్తున్నారని తెలిసిందే. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ అని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని తీసుకున్నట్టు సమాచారం. నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలతో మెప్పించినా అనుకున్నంత అవకాశాలు రాలేదు. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా ఆ సినిమా రెండేళ్ల నుంచి వాయిదా పడుతూనే వస్తుంది.
హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ అయితే తన ఫేట్ మారుతుందేమో, సినిమా అవకాశాలు వస్తాయనుకుంటే అది రోజు రోజుకి లేట్ అవుతుంది. తాజాగా నిధి అగర్వాల్ ని ప్రభాస్ సినిమాలో తీసుకున్నట్టు సమాచారం రావడంతో ఇదే కనక నిజమైతే నిధి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని అంటున్నారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది నిది. ఈ ప్రభాస్ సినిమా అయినా తొందరగా వస్తే నిధి కెరీర్ ముందుకి వెళ్తుందేమో చూడాలి. అయితే ప్రభాస్ మారుతి సినిమాపై ఇప్పటిదాకా ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయకపోవడం విశేషం.
