Niharika Konidela: ఆ వార్తలు నమ్మకండి.. ఏదైనా ఉంటే చెప్తాను.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నిహారిక
తన సినిమాల గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నిహారిక కొణిదెల(Niharika Konidela).
- V Santhosh Kumar
- Published On : March 22, 2026 / 11:50 AM IST
Niharika Konidela gives clarity on doing a film with her brother Ram Charan
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తన ప్రయాణాన్ని మాత్రం చిన్నగానే స్టార్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక నిర్మాత కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె సంస్థ నుంచి వస్తున్న సినిమా రాకాసా. హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. మానస శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యం రాకాసా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు నిహారిక.
Kalki 2: కల్కి 2లో మరో స్టార్ ఎంట్రీ.. అప్పుడు ఆర్జీవీ ఇప్పుడు.. అంచనాలు పెంచుతున్న లేటెస్ట్ అప్డేట్
అయితే, గత కొంత కాలంగా నిహారిక(Niharika Konidela) తన అన్నయ్య, మెగా పవర్ స్టార్ తో సినిమా చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలపై నిహారిక స్పందించారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లతో సినిమాలు చేయాలనేది తన చిరకాల కోరిక అని, అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలేవీ లేవని ఆమె స్పష్టం చేశారు. చరణ్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా తీసే స్థాయికి తాను ఇంకా ఎదగలేదని, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
“ఒకవేళ తన అన్నయ్యలతో సినిమా చేసే అవకాశం వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే అధికారికంగా ప్రకటిస్తాను. అటువంటి గొప్ప సందర్భాన్ని లీకుల రూపంలో కాకుండా, ఎంతో గ్రాండ్‌గా అభిమానులతో పంచుకుంటాను. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో, రామ్ చరణ్ సినిమాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. ఇక, నిహారిక ప్రస్తుతం ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేయడం, సినిమాలను నిర్మించడం వంటి బాధ్యతలే ఆమెకు ఎక్కువ సంతృప్తిని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఆమె నుంచి వస్తున్న రాకాసా సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుంది అనేది చూడాలి.
