Kalki 2: కల్కి 2లో మరో స్టార్ ఎంట్రీ.. అప్పుడు ఆర్జీవీ ఇప్పుడు.. అంచనాలు పెంచుతున్న లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ కల్కి 2(Kalki 2) సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్న సౌత్ సీనియర్ స్టార్ హీరో.
Jd chakravarthy playing a special role in kalki 2
- ప్రభాస్ లేకుండానే కల్కి 2 షూటింగ్
- స్పెషల్ రోల్ లో సీనియర్ స్టార్
- త్వరలోనే కల్కి 2 సెట్స్ కి ప్రభాస్
Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ ‘కల్కి పార్ట్-2(Kalki 2)’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ముగిసిన చోట నుంచి కథ ఎటు మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కల్కి సీక్వెల్ షూటింగ్ పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెట్టకుండానే కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నాడు దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర నటులపై ముఖ్యమైన సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ రెండో భాగంలో ఒక సర్ప్రైజ్ ఎంట్రీ ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Sreeleela: అమ్మా.. నావల్ల కావడం లేదు.. ట్రోల్స్ తట్టుకోలేక ఏడ్చేసిన శ్రీలీల
వెర్సటైల్ నటుడు జె.డి. చక్రవర్తి కల్కి 2లో స్పెషల్ రోల్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆయన షూటింగ్ సెట్స్‌లో కూడా ప్రత్యక్షమయ్యారని, సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే, ఈయన పాత్రను అలాగే సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంచుతారా. లేక రివీల్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అతి త్వరలోనే కల్కి సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నాగ్ అశ్విన్ ఈసారి యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
మొదటి భాగంలో సుప్రీమ్ యాస్కిన్‌గా భయపెట్టిన కమల్ హాసన్, ఈ సీక్వెల్లో పూర్తిస్థాయి విలన్‌గా విశ్వరూపం చూపించబోతున్నారు. అయితే, ఈసారి హీరోయిన్ విషయంలో చిన్న మార్పు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఎవరు చేస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
