Sreeleela: అమ్మా.. నావల్ల కావడం లేదు.. ట్రోల్స్ తట్టుకోలేక ఏడ్చేసిన శ్రీలీల
తనపై జరిగిన ట్రోలింగ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన శ్రీలీల(Sreeleela).
Sreeleela emotional comments about the trolling on her
- సినిమాలు వదిలేద్దాం అనుకున్న శ్రీలీల
- ట్రోలింగ్ తట్టుకోలేక ఏడ్చేసిందట
- తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్
Sreeleela: టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఆమె కెరీర్ గ్రాఫ్ మాత్రం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూనే ఉంది. పెళ్లిసందDతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు, ‘ధమాకా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత కుర్ర హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.
అయితే, అవకాశాలు భారీగానే వచ్చాయి కానీ, ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విజయం సాదించకపోవడం విశేషం. ఆమె చేసిన సినిమాల్లో ధమాకా, భగవంత్ కేసరి మినహా మిగిలిన అన్నీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల(Sreeleela)పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అయితేఎం, రీసెంట్ గా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది.
Vijay- Rashmika: విజయ్- రష్మిక హనీమూన్ వెకేషన్.. థాయ్‌లాండ్‌లో కొత్త జంట ఫొటోస్
ఈనేపథ్యంలోనే, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల తనపై వచ్చిన విమర్శల గురించి మనసు విప్పి మాట్లాడింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన నెగెటివ్ ట్రోల్స్ తనను ఎంతగానో కుంగదీశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను చాలా సెన్సిటివ్ పర్సన్ కావడంతో, ఆ విమర్శలు చూసి భయపడేదాన్నని, కొన్నిసార్లు తట్టుకోలేక ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది.
“ఇదంతా నా వల్ల అవుతుందా? నేను భరించలేకపోతున్నాను.. సినిమాలు వదిలేసి మళ్లీ కాలేజీకి వెళ్లి చదువుకుంటా?” అని తన తల్లిని అడిగినట్లు గుర్తుచేసుకుంది. అయితే, కాలక్రమేణా తనలో మార్పు వచ్చిందని, ఇప్పుడు అలాంటి ట్రోల్స్‌ను ధైర్యంగా ఎదుర్కొనే పరిణతి సాధించానని స్పష్టం చేసింది. ఒక సాధారణ అమ్మాయి నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగే క్రమంలో శ్రీలీల ఎదుర్కొన్న ఈ మానసిక సంఘర్షణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో. శ్రీలీలపై ఇప్పుడు చాలా మంది పాజిటీవ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళావ్ చూడు అది గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
