Niharika : టీవీ షోలో నిహారిక సీక్రెట్స్ బయటపెట్టిన తల్లి.. గర్ల్స్ కాలేజీలో జాయిన్ చేస్తే ఇంకేం చేసేదానివో..
నిహారిక తల్లి పద్మజ మాట్లాడుతూ నిహారిక గురించి చాలా సీక్రెట్స్ చెప్పింది. (Niharika)
- Saketh U
- Published On : April 6, 2026 / 08:24 PM IST
Niharika
Niharika : నిహారిక ప్రస్తుతం నిర్మాతగా వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. నిహారిక నిర్మాణంలో ఇటీవలే వచ్చిన రాకాస సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరోవైపు నిహారిక టీవీ షోలతో కూడా అలరిస్తుంది. ఆట షోలో జడ్జిగా చేస్తుంది నిహారిక.
తాజాగా ఈ షోకి నిహారిక తల్లి పద్మజ వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో నిహారిక తల్లి పద్మజ మాట్లాడుతూ నిహారిక గురించి చాలా సీక్రెట్స్ చెప్పింది.
Also Read : Varanasi : ఇక్కడేమో ఫ్యాన్స్ వెయిటింగ్.. అక్కడేమో ‘వారణాసి’కి సమ్మర్ హాలిడేస్..
నిహారిక తల్లి పద్మజ మాట్లాడుతూ.. నిహారికనే ఇంట్లో డామినేట్ చేస్తుంది. చిన్నప్పుడు వరుణ్ ని బాగానే కొట్టేది. నేను వరుణ్ కి సపోర్ట్ చేస్తా ఎందుకంటే నిహారిక, వాళ్ళ నాన్న ఒక టీం. స్కూల్ లో బోర్డు మీద టీచర్ రాస్తే ఏది రాసుకునేది కాదు. నేను నెక్స్ట్ డే వెళ్లి నోట్స్ అంతా నేను రాసుకొచ్చేదాన్ని. వరుణ్ చదివే కాలేజీలో చదివితేనే కాలేజీ ఎగ్గొట్టి వెళ్లేదానివి. ఇంక గర్ల్స్ కాలేజీలో చదివితే ఇంకేం చేసేదానివో. నిహారిక వంట చేస్తుంది. కానీ ఆ కిచెన్ లోకి తర్వాత మనం వెళ్ళామంటే సర్దుకోలేక చచ్చిపోవాలి అంటూ నిహారిక గురించి సరదా సీక్రెట్స్ అన్ని బయటపెట్టింది.
దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ప్రోమోలో ఇన్ని సీక్రెట్స్ చెప్పారంటే ఇక ఎపిసోడ్ లో నిహారిక గురించి ఆమె తల్లి ఇంకెన్ని చెప్పిందో చూడాలి అనుకుంటున్నారు. మీరు కూడా ఈ సరదా ప్రోమో చూసేయండి..
Also Read : Adivi Sesh : వాళ్లకు ఇచ్చిన మాట కోసం.. బాలీవుడ్ సినిమాలు వదిలేసుకుంటున్న అడివి శేష్..
