సూర్యకాంతం టీజర్ : తెలుసుకుని ఏం చేస్తాం

సూర్యకాంతంలో డైరెక్టర్, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో నిహారిక క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేసాడు.

  • Publish Date - January 25, 2019 / 12:06 PM IST

సూర్యకాంతంలో డైరెక్టర్, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో నిహారిక క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేసాడు.

మెగా డాటర్ కొణిదెల నిహారిక, రాహుల్ విజయ్ మెయిన్ లీడ్స్‌గా, ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్షన్‌లో, నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా.. సూర్యకాంతం. రీసెంట్‌గా సూర్యకాంతం టీజర్‌ని ఆన్‌లైన్‌లో వరుణ్ తేజ్ రిలీజ్ చేసాడు.

రాహుల్, నిహారికని.. నీ పేరేంటని అడిగితే, నిహారిక ఎటాకారంగా, పేరు తెల్సుకుని ఏం చేస్తావ్, రేపొద్దున నీకు పుట్టబోయే పిల్లలకి పెట్టుకుంటావా? అని కౌంటర్ ఇవ్వడంతో స్టార్ట్ అయిన టీజర్ చాలా ఫన్నీగా ఉంది. తినడానికి పునుగుల్లేవు కానీ, బెగ్గర్‌కి బర్గర్ తినిపించాడంట నీలాంటోడు, మామూలు అమ్మాయిలే అబ్బాయిల్ని ఫుట్‌బాల్ ఆడుకుంటారు, నువ్వు డైరెక్ట్‌గా ఫుట్‌బాల్ ప్లేయర్‌తోనే పెట్టుకున్నావ్ లాంటి డైలాగ్స్ అదిరిపోయాయి.

ఇక టీజర్ చివర్లో నిహారికతో మథర్ సుహాసిని, నేను అయిదు లెక్కపెట్టేలోపు నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోతే నిజంగానే కోసుకుంటాను అని బెదిరింపుగా అంటే, నిహారిక స్పీడ్‌గా.. వన్, టు, త్రీ, ఫోర్, ఫైవ్.. కోస్కో అని చెప్పడం అయితే ఒక రేంజ్‌లో ఉంది. డైరెక్టర్, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో నిహారిక క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేసాడు. మార్చ్ 29న సూర్యకాంతం సిల్వర్ స్ర్కీన్స్‌పైకి రాబోతుంది. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణలో, సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసారు.

లేటెందుకు, టీజర్ చూసి ఎంజాయ్ చెయ్యండి మరి.