Nikhil Siddhartha : నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీ.. ‘స్వయంభు’ ఫస్ట్ లుక్ పోస్టర్!

నిఖిల్ సిద్దార్థ తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. స్పై సినిమా తరువాత ఈ మూవీలోని నటించబోతున్నాడట. ఫాంటసీ కథాంశంతో వస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా..

Nikhil Siddhartha next movie titled as Swayambhu and first look released

Nikhil Siddhartha Swayambhu : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ కార్తికేయ 2 తో పాన్ ఇండియా సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం Spy అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని కూడా పాన్ ఇండియా మూవీ గానే ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక ఇటీవల రామ్ చరణ్ (Ram Charan) నిర్మాణంలో ‘ది ఇండియన్ హౌస్’ అంటూ ఇంకో పాన్ ఇండియా మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఇక నిన్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈరోజు (జూన్ 1) తన బర్త్ డే ఆ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు.

Ram Charan : గీతా ఆర్ట్స్‌లో 300 కోట్లతో రామ్‌చరణ్ సినిమా.. కన్‌ఫార్మ్ చేసిన దర్శకుడు!

ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీకి ‘స్వయంభు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. పోస్టర్ లో నిఖిల్ యుద్ధభూమిలో పోరాటం చేస్తూ కనిపిస్తున్నాడు. నిఖిల్ కెరీర్ లో ఇలాంటి సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. తమిళ చిత్రం ‘కోబ్రా’కి రైటర్ గా వర్క్ చేసిన భారత్ కృష్ణమాచారి ఈ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందించబోతున్నాడు.

Samantha : నువ్వు నా పక్కనే నిల్చునే స్నేహితుడివి.. రౌడీ హీరోపై సమంత స్పెషల్ పోస్ట్..

స్పై సినిమా తరువాత ఈ మూవీనే ఉండబోతుందని నిఖిల్ తెలియజేశాడు. కాగా స్పై మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. గర్రి బిహెచ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్ గా నటిస్తుంది.