×
Ad

Swayambhu: నిఖిల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. స్వయంభూ మరోసారి వాయిదా

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభూ(Swayambhu) మరోసారి వాయిదా పడింది.

Nikhil Siddhartha Swayambhu movie postponed once again.

  • నిఖిల్ స్వయంభూ మరోసారి వాయిదా
  • గ్రాఫిక్స్ పనుల్లో ఆలస్యం
  • త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన

Swayambhu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మూవీ స్వయంభూ(Swayambhu). దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Sadha: సదా అందాలకు కుర్రకారు ఫిదా.. ఫోటోలు వైరల్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై హైప్ ను మరింతగా పెంచేశాయి. మేకింగ్ వీడియోస్ కూడా చాలా గ్రాండియర్ గా ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ, షూటింగ్ ఆలస్యం వల్ల రిలీజ్ పై స్పష్టత రావడం లేదు. రీసెంట్ గా ఈ సినిమాను ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది.

ఆడియన్స్ కూడా స్వయంభూ ఫిబ్రవరి 13న రావడం ఖాయం అని అనుకున్నారు. కానీ, తాజా సమాచారం మేరకు ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. స్వయంభూ సినిమాలో గ్రాఫికల్, వీఎఫెక్స్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయట. వాటి కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట మేకర్స్. ఆడియన్స్ కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదట. అందుకే, ఆ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.