Nikhil Sidhartha : వెయ్యేళ్ళ క్రితం తిరుపతిలో కథతో.. మా సినిమాలో శక్తిమాన్.. ‘స్వయంభు’ గురించి లీక్ చేసిన నిఖిల్..
తాజాగా నిఖిల్ యాంకర్ సుమకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంభు సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. (Nikhil Sidhartha)
- Saketh U
- Published on- August 4, 2026 / 01:11 PM IST
Nikhil Sidhartha
Nikhil Sidhartha : హీరో నిఖిల్ కార్తికేయ 2 హిట్ తర్వాత అన్ని భారీ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో స్వయంభు సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ ఓ పోరాడే యోధుడిగా కనిపించబోతున్నాడు. రాజుల కాలం నాటి కథతో ఈ సినిమా రానుందని ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్ తో క్లారిటీ వచ్చింది. తాజాగా నిఖిల్ యాంకర్ సుమకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంభు సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.
నిఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమా వెయ్యేళ్ళ క్రితం జరిగిన రియల్ కథ. 985వ సంవత్సరం రాజుల కాలంలో అప్పుడు తిరుపతి దగ్గర శ్రీగిరి అనే ప్రదేశంలో జరిగిన కథ ఇది. ఆ కథ ఆధారంగా సినిమాని తీసాము అని తెలిపారు. అలాగే.. ఈ సినిమాలో అందరి ఫేవరేట్ శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా నటించారు. ఆయన చాలా మంచి పాత్ర పోషించారు ఈ సినిమాలో అని తెలిపాడు నిఖిల్.
Also Read : Trinadha Rao Nakkina : జెన్ జీ పై డైరెక్టర్ సంచలన కామెంట్స్.. వాళ్లకు ఎమోషన్స్ తెలియవు.. చెప్పినా వినరు..
బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా, నటుడిగా నటించిన ముఖేష్ ఖన్నా శక్తిమాన్ సీరియల్ తోనే బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. 1997 – 2005 మధ్య కాలంలో వచ్చిన శక్తిమాన్ సీరియల్ పెద్ద హిట్ అయింది. అప్పటి పిల్లలకు ఈ సీరియల్ చాలా ఫేవరేట్. గతంలో ముఖేష్ ఖన్నా తెలుగులో ధన 51, పురుషోత్తముడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మళ్ళీ నిఖిల్ స్వయంభు సినిమాలో నటిస్తున్నారు.
