Trinadha Rao Nakkina : జెన్ జీ పై డైరెక్టర్ సంచలన కామెంట్స్.. వాళ్లకు ఎమోషన్స్ తెలియవు.. చెప్పినా వినరు..
జెన్ జీ కొంతైనా మారాలని ఈ సినిమా తీసాను అని చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Trinadha Rao Nakkina)
Trinadha Rao Nakkina
Trinadha Rao Nakkina : మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మెప్పిస్తున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తాజాగా త్రినాథరావు నక్కిన నిర్మాతగా విక్రమ్ సాహిదేవ్, సంధ్య జంటగా ఖగేష్ దర్శకత్వంలో అనకాపల్లి అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ అవుతుండగా నేడు త్రినాథరావు మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో జెన్ జీ కొంతైనా మారాలని ఈ సినిమా తీసాను అని చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Kamakshi Bhaskarla : ఇవే సినిమాలు తమిళ్లో చేస్తే అవార్డులు వచ్చేవి.. తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. నేను రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్నాను. అందరూ జెన్ జీ అంటున్నారు కానీ వాళ్లకు ఎమోషన్స్ తెలీవు. మనం కూడా జెన్ జీ ఇంతే అని వదిలేస్తున్నాము. కానీ ఆ జెన్ జీ ఎక్కడికి వెళ్తుందో అర్ధం కావట్లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఇంట్లో అమ్మ, నాన్న ఉన్నారు. మన సేఫ్టీ కోసమే వాళ్ళు ఉన్నారు అని వాళ్లకు తెలియాలి. జెన్ జీ మాట వినకపోతే తల్లితండ్రులు స్ట్రగుల్ అవుతున్నారు. జెన్ జీ చేసే కొన్ని పనులకు ఫ్యామిలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ జీవితం కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం చెప్పినా వినరు. నేను చెప్పినా కూడా వినరు.
కానీ నాకు కొంత బాధ్యత ఉంది అందుకే నేను ఈ సినిమా చేశాను. యూత్ దీనికి కనెక్ట్ అవుతారు. వాళ్లకు అర్ధం కావాలి అనే ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా హైలెట్ చేశాను. ఇందులో అంతర్లీనంగా మెసేజ్ ఉంటుంది. లైఫ్ చాలా వ్యాల్యుబుల్. కానీ మనం ఏదో రకరకాల పేర్లు పెట్టుకొని ఫ్యాషన్ అని చెప్పి వేరే వాటికీ అట్రాక్ట్ అయిపోయి తీరా చూస్తే ఏం ఉండదు. మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే జెన్ జీ వాళ్ళు ఈ సినిమా చూడాలి అని అన్నారు.
Also See : Sreeleela : గోల్ఫ్ ఆడటానికి రెడీ అయిన శ్రీలీల.. ఫొటోలు..
