×
Ad

Nilave : లవ్ స్టోరీలలో కెజిఎఫ్ లాంటి సినిమా ఇది.. ప్రేమికుల రోజుకు ‘నిలవే’..

నిలవే సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.(Nilave)

Nilave

Nilave : సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా నిలవే. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మాణంలో సాయి కే వెన్నం, సౌమిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వైవా హర్ష, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. నిలవే సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.(Nilave)

ఈ ఈవెంట్లో సింగర్ సునీత మాట్లాడుతూ.. ఇటీవల చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తున్నాం. అలంటి ఎమోషన్స్ ఉన్న సినిమా ’నిలవే‘. కాలం మారినా ఇంటెన్స్ మ్యూజిక్ అలానే వుంటుంది. నేను ఇక్కడ ఉండటానికి కారణం అదే. నిలవే సినిమా చూసాను. ఇది అర్థవంతమైన సినిమా. మ్యూజికల్ లవ్ స్టోరీ. సఖి, ఏ మాయే చేశావే లాంటి సినిమాల్లా ఫీల్ గుడ్ సినిమా అవుతుంది అని అన్నారు.

Also Read : Rajpal Yadav: స్టార్ కమెడియన్ బెయిల్ విచారణ.. రంగంలోకి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గన్..!

హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ.. తెలుగులో నాకు ఇదే మొదటి సినిమా. ఇప్పటి జెన్ జీ జనరేషన్ కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారు అని తెలిపింది.

హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ.. నేను సినిమాలోకి వెళుతున్నానని చెప్పినప్పటినుంచీ మా నాన్నగారు ఎంతో సపోర్ట్ చేశారు. నన్ను హీరో, దర్శకుడిగా మార్చింది సాయి కే వెన్నం. చిన్నప్పటినుంచీ నటుడు కావాలనే కోరిక వుండేది. యాక్షన్ మూవీస్ లో కె.జి.ఎఫ్. ఎలా వుందో లవ్ స్టోరీస్ లో కే జీ ఎఫ్ లాంటిది నిలవే సినిమా అని అన్నారు. డైరెక్టర్ సాయి కే వెన్నం మాట్లాడుతూ.. 30 లక్షల్లో మంచి సినిమా తీయవచ్చు కానీ జనాల్లోకి తేవాలంటే కోట్లు ఖర్చుపెట్టాలని ఓ దర్శకుడు అన్నారు. మా సినిమా కంటెంట్ సినిమా, మంచి సినిమా. ఇందులో అందరూ కొత్తవాళ్లు కావొచ్చు కానీ కష్టపడి తీసాము అని అన్నారు.

Also Read : Anchor Sravanthi : పాపం స్రవంతి.. పెళ్లయింది అని చెప్పడంతో.. తమిళ్ స్టార్ నటుడు కొడుకు..