నిను వీడని నీడను నేనే – టీజర్

సందీప్ కిషన్ బర్త్‌‌డే సందర్భంగా 'నిను వీడని నీడను నేనే' టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Publish Date - May 7, 2019 / 06:15 AM IST

సందీప్ కిషన్ బర్త్‌‌డే సందర్భంగా ‘నిను వీడని నీడను నేనే’ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

సందీప్ కిషన్, అన్య సింగ్ జంటగా, కార్తీక్ రాజు డైరెక్షన్‌లో రూపొందుతున్న థ్రిల్లర్, ‘నిను వీడని నీడను నేనే’.. వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్స్ పై, దయ పన్నెం, సందీప్ కిషన్, విజ్జి సుబ్రమణియన్ నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ బర్త్‌‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. మురళీ శర్మ ఒక కేసు గురించి చెప్తుండగా టీజర్ స్టార్ట్ అవుతుంది. రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని రూపొందించిన ఈ మూవీలో ఆడియన్స్ థ్రిల్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయనిపిస్తుంది టీజర్ చూస్తుంటే.

సందీప్, అన్యల పెయిర్ బాగుంది. టీజర్ చివర్లో సందీప్ కిషన్ అద్దంలో చూసుకుంటుంటే, వెన్నెల కిషోర్ కనబడే షాట్, దెయ్యం అరిచే షాట్ బాగున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు. పోసాని, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : పికె వర్మ, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, సంగీతం : ఎస్ఎస్ థమన్, ఆర్ట్ : విదేష్, స్టంట్స్ : వెంకట్.

వాచ్ టీజర్..