Robinhood : నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజ‌ర్ వ‌చ్చేసింది..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న మూవీ రాబిన్ హుడ్‌.

Nithiin Robinhood teaser out now

Robinhood teaser : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న మూవీ రాబిన్ హుడ్‌. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శ్రీలీల క‌థానాయిక‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రం నుంచి వ‌చ్చిన గ్లింప్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.

ఇక టీజ‌ర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల 05 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం చెప్పింది. చెప్పిన స‌మ‌యానికే టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. భారతీయులంతా నా సోదర సోదరీమణులు అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఫైట్స్‌తో పాటు రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో నితిన్ చేసే కామెడీ బాగుంది.

Matka : మట్కా’ మూవీ రివ్యూ.. రొటీన్ కథకు వరుణ్ తేజ్ నట విశ్వరూపం..

మొత్తంగా టీజ‌ర్ బాగుంది. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిశోర్‌, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.