Adarsha Kutumbam: జెట్ స్పీడ్ లో వెంకటేష్- త్రివిక్రమ్ మూవీ.. మే కల్లా షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam)' సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Venkatesh and Trivikram Aadarsha kutumbam movie will be released in summer.
- వెంకటేష్ మూవీని జెట్ స్పీడ్ లో చేస్తున్న త్రివిక్రమ్
- సమ్మర్ లోనే రిలీజ్ చేస్తారట
- ఫుల్ హ్యాపీ ఫీలవుతున్న వెంకీ ఫ్యాన్స్
Adarsha Kutumbam: టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సెట్ అయిన క్రేజీ కాంబో అంటే విక్టరీ వెంకటేష్ అండ్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబో అనే చెప్పాలి. చాలా కాలం నుంచి ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. నిజానికి, ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఈ కాంబోలో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి, కారణం గతంలో ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలే.
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు కథ మాటలు అందించాడు త్రివిక్రమ్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పటికే, టీవీలో వచ్చినా మిస్ చేయకుండా చూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందుకే, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోకి ఆ రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది.
The Rajasaab: రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది ప్రభాస్ రేంజ్ కానే కాదు!
ఎట్టకేలకు, చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. అదే ‘ఆదర్శ కుటుంబం Ak47(Adarsha Kutumbam)’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్తారట అయ్యింది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. ఆదర్శ కుటుంబం సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్.
అది కూడా మే వరకు కంప్లేట్ చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడట. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ను ఉరకలెత్తిస్తున్నాడట. అలాగే, సమ్మర్ లోనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. దీంతో, ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, త్రివిక్రమ్ కి షూటింగ్ చాలా ఆలస్యం చేస్తాడు అనే బ్యాడ్ నేమ్ ఉంది. ఆ టాక్ ను ఈ సినిమాతో చెరిపేయాలని, అలాగే గుంటూరు కారం సినిమాతో వచ్చిన నెగిటివిటీను కూడా తుడిచేయాలని ప్లే చేస్తున్నాడట.
