The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారట.. ఆ సీన్స్ ఏంటంటే?
రాజాసాబ్(The Rajasaab) సినిమాలో ప్రభాస్ ఓల్డ్ గెటప్ కి సంబంధించిన సీన్స్ యాడ్ చేస్తున్నట్టు దర్శకుడు మారుతి తెలిపాడు.
Director Maruthi interesting comments at the Raja Saab success meet.
- ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మారుతీ
- రాజాసాబ్ ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేస్తున్నారట
- మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తున్నారట
The Rajasaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ థియేటర్స్ లోకి వచ్చేసింది. కానీ, ఆడియన్స్ నుంచి మాత్రం అనుకున్నంత ఆదరణ రాలేదు అనే చెప్పాలి. కథ, కథనం విషయంలో ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా పట్ల అంత సంతృప్తిగా లేరు. అయితే, సినిమా చూసిన చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, రాజసాబ్(The Rajasaab) సినిమాలో ప్రభాస్ ఓల్డ్ లుక్ లేదు అని.
రాజాసాబ్ టీజర్ లో ఈ లుక్ లో ప్రభాస్ ఎంట్రీ ఒక రేంజ్ లో హైలెట్ అయ్యింది. దాంతో, సినిమాలో కూడా ఈ పాత్ర్ర అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది అని ఆడియన్స్ ఫీలయ్యారు. కానీ, తీరా సినిమాలో మాత్రం ఆ పాత్ర తాలూకా సీన్స్ ని కట్ చేశారు. సినిమా ఎలాగూ కాస్త డిజప్పాయింట్ చేసింది కనీసం ఆ లుక్ ఉంటేనైనా బాగుండేది అనుకున్నారు. దీనిపై ఓపెన్ గానే కామెంట్స్ కూడా చేశారు.
తాజాగా ఈ సీన్స్ పై దర్శకుడు మారుతీ స్పందించాడు. ఆలాగే ఆడియన్స్ కి గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. ‘తెలంగాణలో షో సరైన సమయంలో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు రుణపడి ఉంటాను. ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ప్రభాస్‌ను అలానే చూపించాను. మైండ్ గేమ్‌గా సాగే క్లైమాక్స్ బాగుందని చాలా మంది అంటున్నారు. కామన్ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా రీచ్ అయింది’’
ఒక్క షో, ఒక్కరోజుతో కాదు.. పదిరోజులు ఆగితే రాజాసాబ్ సినిమా ఏంటో తెలుస్తుంది. ప్రభాస్ ఓల్డ్ గెటప్ తో టీజర్, పోస్టర్స్‌లో వదిలాం. కానీ, సినిమాలో కనిపించకపోవడంతో చాలా మంది డిజప్పాయింట్ అవుతున్నారు. ఈరోజు(జనవరి 10) సాయంత్రం నుంచి ఆ సన్నివేశాలు యాడ్ అవుతాయి. ఆ సీన్స్ కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారు. దాదాపు 8 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ. మరి ఈ సన్నివేశాలు యాడ్ చేసిన తరువాత సినిమా ఫేట్ ఏమైనా మారుతుందా అనేది చూడాలి.
