Sreeleela : వామ్మో శ్రీలీల స్టేట్ లెవెల్ లో ఇన్ని గేమ్స్ ఆడిందా? ఇన్ని ట్యాలెంట్స్ ఉన్నాయా శ్రీలీలలో..

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల కూడా సందడి చేసింది. శ్రీలీలకు ఇప్పటికే చాలా ట్యాలెంట్స్ ఉన్నాయని అందరికి తెలుసు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ శ్రీలీలకు ఉన్న మరిన్ని ట్యాలెంట్స్ బయటపెట్టాడు.

Nithiin speak about Sreeleela Talents in Extra Ordinary Man Pre Release Event

Sreeleela : ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్(Tollywood) లో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ దూసుకుపోతుంది. అసలు ఖాళీ లేకుండా 24/7 సినిమాల కోసం కష్టపడుతుంది. ఓ పక్క సినిమాలకు కష్టపడుతూనే మరో పక్క డాక్టర్ కోర్స్ కూడా పూర్తి చేస్తుంది. సినిమాల్లో తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. శ్రీలీలకు ప్రస్తుతం ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ వర్క్ కూడా ఉంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా, ఏ ఈవెంట్ చూసినా శ్రీలీల పేరు వినిపిస్తుంది.

తాజాగా టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా నితిన్(Nithiin), శ్రీలీల జంటగా తెరకెక్కించిన సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’(Extra Ordinary Man). ఈ సినిమాలో హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర చేయడం విశేషం. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిన్న హైదరాబాద్ లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల కూడా సందడి చేసింది. శ్రీలీలకు ఇప్పటికే చాలా ట్యాలెంట్స్ ఉన్నాయని అందరికి తెలుసు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ శ్రీలీలకు ఉన్న మరిన్ని ట్యాలెంట్స్ బయటపెట్టాడు. నితిన్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. నేను హీరో, డ్యాన్స్ వచ్చు నాకు అని మాములుగానే ఉంటుంది. శ్రీలీల కూడా బాగా యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుందని తెలుసు. డాక్టర్ చదువుతుందని తెలుసు. షూటింగ్ మొదటి రోజే శ్రీలీల వచ్చింది. తన గురించి అడిగితే చెప్పింది. తాను యాక్టింగ్, డ్యాన్స్, డాక్టర్ మాత్రమే కాదు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది, హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది. తనకి కూచిపూడి, భారత నాట్యం కూడా వచ్చు. ఇంకా వీణ వాయిస్తుంది. ఇంకా చాలా చెప్పింది. నేను ఆ రోజు చాలు ఇంకా అనకపోతే ఇంకా తన ట్యాలెంట్స్ బయటపడేవి. ఇంత చిన్న పిల్లలో ఇన్ని ట్యాలెంట్స్ అని ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కానీ అసలు శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఉమెన్ అని అన్నారు.

Also Read : Nithiin : రాజశేఖర్ గారి సినిమా వల్లే నేను హీరో అయ్యాను.. మా నాన్న సెటిల్ అయ్యాడు..

దీంతో మరోసారి శ్రీలీల వైరల్ గా మారింది. ఇన్నాళ్లు డ్యాన్స్, సినిమాలు, డాక్టర్ తోనే బిజీ అనుకుంటే మరో పక్క గేమ్స్, ఇంకా స్పెషల్ ట్యాలెంట్స్ చాలానే ఉన్నాయని తెలియడంతో మరోసారి అభిమానులు, నెటిజన్లు ఆమెని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు