Nithiin : రాజశేఖర్ గారి సినిమా వల్లే నేను హీరో అయ్యాను.. మా నాన్న సెటిల్ అయ్యాడు..

ఈ సినిమాలో రాజశేఖర్ స్పెషల్ రోల్ చేయడంతో ఆయన గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు నితిన్.

Nithiin : రాజశేఖర్ గారి సినిమా వల్లే నేను హీరో అయ్యాను.. మా నాన్న సెటిల్ అయ్యాడు..

Nithiin Interesting Comments his Father Settled Because of Hero Rajashekar Movie

Nithiin : టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ(Vakkantham Vamsi) మరోసారి దర్శకుడిగా మారి నితిన్(Nithiin), శ్రీలీల జంటగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’(Extra Ordinary Man). ఈ సినిమాలో హీరో రాజశేఖర్(Rajashekar) ముఖ్య పాత్ర చేయడం విశేషం. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిన్న హైదరాబాద్ లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ సినిమా గురించి మాట్లాడి చిత్రయూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పారు. సినిమాని థియేటర్స్ లో చూడమని ప్రేక్షకులని కోరారు. ఈ సినిమాలో రాజశేఖర్ స్పెషల్ రోల్ చేయడంతో ఆయన గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు నితిన్.

Also Read : Bigg Boss 7 Day 92 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

నితిన్ మాట్లాడుతూ.. నేను హీరోగా మారడానికి కొన్ని కారణాలు ఉంటే అందులో ఒక కారణం రాజశేఖర్ గారు కూడా. రాజశేఖర్ గారు చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూటర్ గా మారారు. మా నాన్నకి డిస్ట్రిబ్యూటర్ గా అదే మొదటి సినిమా. ఆ సినిమా పెద్ద విజయం సాధించి, డబ్బులు వచ్చి మా నాన్న ఈ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. దీంతో నాకు కూడా ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇటు వచ్చాను. ఒకవేళ మగాడు సినిమా ప్లాప్ అయి ఉంటే మా నాన్న మళ్ళీ సినిమాల జోలికి వచ్చేవారు కాదేమో, నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో అని అన్నారు.