Nithiin : మారేడుమిల్లి అడవుల్లో మొదలైన నితిన్ కొత్త మూవీ..
గత కొంతకాలంగా సరైన హిట్టు లేక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డీలా పడిపోయాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విఫలమైంది. అయితే ప్లాప్‌ల్లో ఉన్న ఈ హీరో సక్సెస్ కోసం మరో ప్లాప్ దర్శకుడితో జతకడుతున్నాడు.
- gum 95921
- Published On : November 28, 2022 / 03:00 PM IST
Nithiin's new movie started in Maredumilli forests
Nithiin : గత కొంతకాలంగా సరైన హిట్టు లేక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డీలా పడిపోయాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విఫలమైంది. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి నితిన్ కి ఎదురుదెబ్బె తగులుతుంది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మరోమారు మాస్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు.
Vakkantham Vamsi : ఎన్టీఆర్ సినిమాను అల్లు అర్జున్ తమిళంలో రీమేక్ చేస్తా అన్నాడు.. వక్కంతం వంశీ!
అయితే ప్లాప్‌ల్లో ఉన్న ఈ హీరో సక్సెస్ కోసం మరో ప్లాప్ దర్శకుడితో జతకడుతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ రైటర్ గా ఎంతో పేరుని సంపాదించుకున్న రైటర్ ‘వక్కంతం వంశీ’. కానీ దర్శకుడిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయాడు. అల్లు అర్జున్ తో కలిసి తీసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ భారీ పరాజయాన్ని మూటకొట్టుకుంది. ఆ సినిమా తరువాత రెండో మూవీ కోసం దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఇప్పుడు నితిన్ తో వస్తున్నాడు.
కాగా ఈ మూవీ మొదటి షెడ్యూల్.. ఈ ఆదివారం మారేడుమిల్లి అడవుల్లో మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో నితిన్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నాడు దర్శకుడు వంశీ. ఈ మూవీలో నితిన్ గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల నటిస్తుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా వక్కంతం వంశీకి, నితిన్ కి హిట్టు ని అందిస్తుందేమో చూడాలి.
#NITHIIN32 officially begins today ?
The first schedule of shoot has started in Maredumilli..@actor_nithiin
Directed by @VamsiVakkantham.
A @Jharrisjayaraj Musical@sreeleela14
Produced by #SudhakarReddy #NikhithaReddy @SreshthMovies pic.twitter.com/QAdqHTe86u— BA Raju’s Team (@baraju_SuperHit) November 27, 2022
