Vakkantham Vamsi : ఎన్టీఆర్ సినిమాను అల్లు అర్జున్ తమిళంలో రీమేక్ చేస్తా అన్నాడు.. వక్కంతం వంశీ!

టాలీవుడ్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ.. తెలుగుతెరపై ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వక్కంత వంశీ కాంబినేషన్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. రెండు తాజాగా వక్కంతం వంశీ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోకి గెస్ట్ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఆశక్తికర విషయాలని బయటపెట్టాడు ఈ స్టార్ రైటర్. తను రాసిన కథల్లో...

Vakkantham Vamsi : ఎన్టీఆర్ సినిమాను అల్లు అర్జున్ తమిళంలో రీమేక్ చేస్తా అన్నాడు.. వక్కంతం వంశీ!

Vakkantham Vamsi said Allu Arjun Wants to Remake NTR Oosaravelli movie

Updated On : November 23, 2022 / 1:09 PM IST

Vakkantham Vamsi : టాలీవుడ్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ.. తెలుగుతెరపై ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వక్కంత వంశీ కాంబినేషన్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా వక్కంతం వంశీ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోకి గెస్ట్ వచ్చాడు.

NTR : చేపలు అమ్ముతున్న జూనియర్ ఎన్టీఆర్..

ఈ నేపథ్యంలోనే ఎన్నో ఆశక్తికర విషయాలని బయటపెట్టాడు ఈ స్టార్ రైటర్. తను రాసిన కథల్లో ఒక రెండు కథలని మళ్ళీ రీమేక్ చేయడానికి అల్లు అర్జున్ చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. “ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాని రీమేక్ చేయాలని నాతో ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఆ సినిమాని ఎప్పటికైనా తమిళంలో రీమేక్ చేస్తాను అని చెప్పేవాడు” అని తెలియజేశాడు.

“అలాగే రవితేజ హీరోగా తెరకెక్కిన ‘కిక్-2’ అంటే బన్నీకి చాలా ఇష్టం. ఆ సినిమాలో చాలా కొత్త పాయింట్లు ఉన్నాయి. అది వర్క్ అవుట్ అయ్యేలా మళ్ళీ చేదాం” అని అడిగేవాడని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం వక్కంతం వంశీ రైటర్ గా సురేంద్ర రెడ్డి ఏజెంట్ సినిమాకు కథని అందించగా, డైరెక్టర్ గా నితిన్ 32వ సినిమాను లైన్ లో పెట్టాడు.