ట్రోల్స్ తో ఇబ్బందిగా ఉందన్న నిత్యా మీనన్

నిత్యా మీనన్ శరీరాకృతిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయ్. రీసెంట్ గా అక్షయ్ కుమార్ హీరోగా నటించి విడుదలైన మిషన్ మంగళ్ సినిమాలో నిత్యా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నిత్యా చాలా లావుగా ఉండటంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నబాగా తిని ఎంజాయ్ చేయడం వల్లే లావుగా మారిపోయిందంటూ పలువురు సోషల్ మీడియాలో నిత్యను ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే తనను ట్రోల్ చేస్తున్నవారికి నిత్యా మీనన్ సరైన సమాధానం చెప్పింది. నిత్యా మీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… నేను లావుగా ఉన్నానని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నేనేమి కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తూ లావుగా మారలేదు. మహిళలు లావు కావడానికి రకరకాల కారణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. సోమరితనం వల్ల బాగా తినడం వల్ల నేను లావు అవుతున్నానని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ అలా అనుకోవడం తప్పు. హార్మోన్ల లోపం వల్ల చాలా మంది బరువు పెరిగి లావు అవుతారు. అలాంటి సమస్య వస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అన్నారు నిత్యామీనన్.
అంతేకాదు మేము ఓ సమస్యతో బాధపడుతుంటే నెటీజన్స్ ట్రోల్స్ తో మరింత బాధపెడుతున్నారు. నాపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కి నేను చాలా సార్లు బాధపడ్డాను. నాకు సినిమా ఒక్కటే జీవితం. దానిని తప్ప నాకు మరో ప్రపంచం లేదు. అలాంటిది నా అంతట నేను నా శరీరాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాను చెప్పండి అంటూ నిత్య మీనన్ చాలా ఫీల్ అయ్యింది.
ప్రస్తుతం నిత్యా మీనన్ మలయాళంలో కొలంబి అనే సినిమా, తమిళంలో జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది. అంతేకాదు మిస్కన్ దర్శకత్వంలో సైకో సినిమాలో కూడా నటిస్తున్నది. కానీ కొన్ని కారణాల వల్ల సైకో సినిమా ఆగిపోయింది.