Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..

ఇటీవల యాక్షన్, సస్పెన్స్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఫీల్ గుడ్ లవ్ మూవీస్, ఆసక్తిగా సాగే ప్రేమకథలు తక్కువగా వస్తున్నాయి.(Sundarakanda)

Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..

Sundarakanda

Updated On : August 27, 2025 / 12:07 AM IST

Sundarakanda : నారా రోహిత్ హీరోగా శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘సుందరకాండ’. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాణంలో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. సుందరకాండ సినిమా నేడు వినాయకచవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్స్ లో రిలీజయింది. ముందురోజే ప్రీమియర్స్ కూడా వేశారు.(Sundarakanda)

కథ విషయానికొస్తే.. సిద్దార్థ్(నారా రోహిత్) కి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లి అవ్వదు. తనకు కావాల్సిన అయిదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టి వచ్చిన సంబంధాలన్నీ చెడగొడతాడు. తను చిన్నప్పుడు ప్రేమించిన తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని తలుచుకుంటూ, ఆమె క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెతుక్కుంటూ ఉంటాడు. అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో ఐరా(వృతి వాఘాని) పరిచయం అవుతుంది. ఆమెలో రెండు క్వాలిటీస్ ఉన్నాయని కనిపెట్టి మిగిలిన మూడు క్వాలిటీస్ ఉన్నాయేమో అని వెతుక్కుంటూ వైజాగ్ లో తిరుగుతాడు.

ఐరా తన ఫ్రెండ్ సత్య(సత్య) పనిచేసే కాలేజీలో చదువుతుంది. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా తను అనుకున్న అయిదు క్వాలిటీస్ ఐరాలో ఉండటంతో ప్రపోజ్ చేస్తాడు. మొదట ఒప్పుకోకపోయినా సిద్దార్థ్ తన జాబ్ వదిలేసి కాలేజీలో లెక్చరర్ గా చేరుతాడు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుండగా సడెన్ గా వైష్ణవి ఎంటర్ అవుతుంది. మరి సిద్దార్థ్ – ఐరా పెళ్లి అవుతుందా? వైష్ణవి కథ ఏంటి? వైష్ణవి – ఐరా మధ్య సంబంధం ఏంటి? ఐరా కోసం సిద్దార్థ్ ఏం చేసాడు? సిద్దార్థ్ అక్క(వాసుకి) ఎలాంటి హెల్ప్ చేసింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈసారి రికార్డ్ కొట్టాల్సిందే.. నో ఛాన్స్.. కెరీర్ హైయెస్ట్ రాబడతాడా?

సినిమా విశ్లేషణ.. ఇటీవల అన్ని యాక్షన్, సస్పెన్స్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఫీల్ గుడ్ లవ్ మూవీస్, ఆసక్తిగా సాగే ప్రేమకథలు చాలా తక్కువగా వస్తున్నాయి. సుందరకాండ సినిమా అలాంటి ప్రేమకథే. ఫస్ట్ హాఫ్ అంతా క్వాలిటీస్ పట్టుకొని హీరో అమ్మాయిలను వెతుక్కోవడం, వైష్ణవి ఫ్లాష్ బ్యాక్, ఐరాతో పరిచయం, ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా సిద్దార్థ్ – ఐరా పెళ్లి జరుగుగుతుందా లేదా? మధ్యలో వైష్ణవి ఏం చేస్తుంది అని ప్రతి సీన్ ఇంట్రెస్ట్ గానే సాగుతుంది.

అయితే సెకండ్ హాఫ్ లో కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఇంకా ఉందా అనేట్టు సీన్స్ రాసి కాస్త సాగదీశారు. వైష్ణవి పాత్ర ఫ్లాష్ బ్యాక్ గురించి ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది. సినిమాలో కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. సత్య కామెడీ సీన్స్ కి చాలా ప్లస్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కాలేజీలో లెక్చరర్ – స్టూడెంట్ అందరి ముందు లవ్ స్టోరీకి సంబంధించి కొన్ని సీన్స్ మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటాయి. అయితే ఇంటర్వెల్ కి ఇచ్చే మెయిన్ ట్విస్ట్ ని రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు ఫస్ట్ హాఫ్ మిడిల్ లోనే గెస్ చేసేయొచ్చు. ఈ సినిమాకి ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా మెయిన్. దాంతోనే సెకండ్ హాఫ్ అంతా ఆసక్తిగా సాగుతుంది. దాన్ని డైరెక్టర్ బాగా డీల్ చేసాడు.

Sundarakanda

నటీనటుల పర్ఫార్మెన్స్..

నారా రోహిత్ చాన్నాళ్ల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ సినిమాతో వచ్చాడు. ఈసారి కష్టపడి డ్యాన్స్ కూడా బాగా ట్రై చేసాడు. బాలీవుడ్ భామ వృతి వాఘాని తెలుగులో ఫస్ట్ సినిమా అయినా ప్రతి ఫ్రేమ్ లో క్యూట్ గా కనిపిస్తూనే బాగా నటించింది కూడా. తన పాత్రకు యాక్టింగ్ కి స్కోప్ ఉంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా అవకాశాలు రావొచ్చు. ఇక ప్రభాస్ ఈశ్వర్ సినిమా హీరోయిన్ శ్రీదేవి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో శ్రీదేవి తన నటనతో మెప్పించింది. ఫ్లాష్ బ్యాక్ లో పాత్రకు తగ్గట్టు కనపడటానికి బాగానే కష్టపడింది. నారా రోహిత్ కాబోయే భార్య సిరి లేళ్ల ఏ ఈసినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో కనిపించి మెరిపించింది.

సత్య ఎప్పట్లాగే తన కామెడీ టైమింగ్ తో ఫుల్ గా నవ్విస్తాడు. సత్య భార్య పాత్రలో సునైనా కూడా బాగానే సెట్ అయింది. హీరో అక్క పాత్రలో ప్రగ్నెంట్ మహిళగా వాసుకి మెప్పిస్తుంది. నరేష్, అభినవ్ గౌతమ్, రూప లక్ష్మి.. పలువురు వారి పాత్రల్లో అక్కడక్కడా నవ్విస్తారు. తమిళ్ కమెడియన్ విటివి గణేష్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రకు ఆయన అవసరంలేకపోయినా తీసుకొచ్చారు. అజయ్, రఘు, విశ్వంత్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Pandu Master : వామ్మో.. ఇన్‌స్టాగ్రామ్ లో అమ్మాయిలు ఇలా చేస్తున్నారా.. ఢీ పండు చెప్పింది వింటే.. మీరు జాగ్రత్త..

సాంకేతిక అంశాలు..  సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ ఫుల్ గా బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. అయితే విశ్వక్ ఓరి దేవుడా సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అదే మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ కావడంతో ఇక్కడ కాపీ కొట్టేసాడు చాలా సీన్స్ లో. సాంగ్స్ బాగున్నాయి. సినిమాలో ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఉన్నది రెండు ఫైట్స్ అయినా కొత్తగా డిజైన్ చేసారు. హీరోయిన్స్, హీరో ఇద్దరి కాస్ట్యూమ్స్ కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. పాయింట్ పాతది అయినా చాలా కొత్తగా కొత్త కథనంతో ఫ్రెష్ గా రాసుకున్నాడు దర్శకుడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘సుందరకాండ’ కామెడీ టచ్ తో ఉన్న ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ. ఓ ట్విస్ట్ తో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ప్రతి సీన్ ని ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.