RTC Employs: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం
సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్ఎంయూఎ, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

RTC Employs: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దస్త్రాన్ని ఆమోదించారు. ఐదేళ్ల పాలనలో ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులను నిలిపివేసింది వైసీపీ సర్కార్.
ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులతో పాటు సూపర్ వైజర్ కేడర్ వరకు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. సుమారు 3వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది.
పదోన్నతుల ద్వారా కింది స్థాయిలో వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక లబ్ది కలగనుంది. ప్రమోషన్లు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అమోదం తెలపడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్ఎంయూఎ, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతుల కోసం కృషి చేసిన రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులు. ప్రమోషన్లకు సంబంధించి ఈ నెలాఖరుకు జీవో విడుదలై, సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: లేడీ డాన్ ఫోన్‌లో ఏముంది? ఆ లీడర్ల గుండెల్లో దడ..! ఆ వీడియోలు, ఆడియోలు ఎవరి కొంప ముంచబోతున్నాయ్?